Chandrababu Naidu - Nandyal
Chandrababu Naidu – Nandyal : నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. కర్నూలులో ఎయిర్ పోర్ట్ నేను కటిస్తే నా పేరు తీసివేసి జగన్ పేరు పెట్టుకున్నారు అని మండిపడ్డారు. ఓర్వకల్లులో 10వేల ఎకరాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేశాను అని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఇండస్ట్రీ అయినా ఉమ్మడి జిల్లాకు వచ్చిందా? అని అడిగారు. కర్నూలు జిల్లాలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు చంద్రబాబు.
”రాయలసీమ ద్రోహి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గోదావరి నీళ్ళు కృష్ణా డెల్టాకు తెచ్చిన ఘనత నాది. రాష్ట్రంలో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అందరూ కలిసి ఫ్యాన్ ను తిప్పేయాలి. వైసీపీ నేతలను దోషులుగా ప్రజల ముందు నిలబెడతా. టీడీపీ అధికారంలోకి రాగానే 24 గంటల కరెంట్ ఇచ్చే భాధ్యత నాది. ఛార్జీలు తగ్గిస్తాను. రాష్ట్రంలో ఒక్కటైనా ప్రభుత్వ శాఖ పని చేస్తుందా? నన్ను తిట్టిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు.
లాండ్ సెటిల్ మెంట్, ఇసుక మాఫియా చేసిన మంత్రి గుమ్మనూరు జయరామ్. పిల్ల కాలువ తవ్వని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి మన సంబరాల రాంబాబు. ఈ ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదు. ఈ పేదవాడు 40కోట్లు ఖర్చు చేసి కూతురిని చూసేందుకు వెళ్ళాడు. 2014 నుంచి నంద్యాలలో ఎన్నో అభవృద్ధి కార్యక్రమలు చేశాము. నంద్యాలను అభివృద్ధి చేసే భాధ్యత నాది. దసరాకి పూర్తి స్థాయిలో మానిఫెస్టో తీసుకొస్తా” అని చంద్రబాబు చెప్పారు.
Also Read..Gudivada: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!