చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. సమయం, వేదిక పూర్తి వివరాలు..

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరుకానున్నారు.

Chandrababu Swearing In Ceremony : ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11గంటల 27 నిమిషాలకు ఆయన ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ను ఎంపిక చేశారు. మంగళగిరి ఎయిమ్స్ స్థలం కంటే ఐటీ పార్క్ స్థలం అనువైనదిగా టీడీపీ నేతలు భావించారు.

ప్రమాణస్వీకారం సభా స్థలాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, మంతెన సత్యనారాయణ రాజు, పెందుర్తి వెంకటేశ్ తదితరులు పరిశీలించారు. ఇక, చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రధాని మోదీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరుకానున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి రెండు స్థలాలను టీడీపీ నేతలు పరిశీలించారు. మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఒక ప్లేస్ ను చూశారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి వద్ద ఐటీ పార్క్ వద్ద మరొక ప్లేస్ ను పరిశీలించారు. ఈ రెండింటిలో ఎక్కడ ప్రమాణస్వీకారం నిర్వహించాలి అనేది చంద్రబాబు అభిమతం మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లక్షలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేయనున్నారు.

Also Read : జగన్‌ను కలవాలంటే పడిగాపులే..! జక్కంపూడి రాజా వ్యాఖ్యలతో ఏకీభవిస్తా- కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు