Chandrababu Protest: దాడి జరిగిన చోటే చంద్రబాబు దీక్ష ప్రారంభం.. ఎవరినీ వదిలేది లేదన్న అచ్చెన్న..!

టీడీపీ అధినేత చంద్రబాబు.. 36 గంటల దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు దాడి చేసిన చోటే.. చంద్రబాబు దీక్ష చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు.. 36 గంటల దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు దాడి చేసిన చోటే.. చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. అంతకుముందు.. ఇంటి నుంచి బయల్దేరిన చంద్రబాబు కాన్వాయ్ కు.. పోలీసులు దారి మార్చారు. అదే మార్గంలో సీఎం జగన్ వెళ్తున్నందున.. దారి మార్చిన కారణంగా సుమారు అరగంట ఆలస్యంగా చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. ఆయన వెంట పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర సీనియర్ నేతలంతా ఉన్నారు.

మత్తుపదార్థాల కారణంగా రాష్ట్ర యువత చెడిపోతోందని అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. జగన్, వైసీపీ నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, డీజీపీ కుట్ర చేసి మొదట చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. తర్వాత.. పార్టీ కార్యాలయంపై దాడి చేశారని అన్నారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజ చైతన్యం కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎవరినీ వదిలేదని లేదని.. వైసీపీ నాయకులను హెచ్చరించారు.

Read More:

CM Jagan on TDP: సీఎం జగన్ సీరియస్.. ఆ విషయంలో పోలీసులు వదలొద్దన్న సీఎం!

Pattabhiram Arrest : నా భర్తకు ప్రాణ హాని ఉంది : పట్టాభి సతీమణి

ట్రెండింగ్ వార్తలు