Pattabhiram Arrest : నా భర్తకు ప్రాణ హాని ఉంది : పట్టాభి సతీమణి

టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పట్టాభిరామ్ అరెస్టుపై ఆయన సతీమణి చందన స్పందించారు. తనకు భర్తాకు ప్రాణ హానీ ఉందన్నారు.

Pattabhiram Arrest : నా భర్తకు ప్రాణ హాని ఉంది : పట్టాభి సతీమణి

Chandana

Pattabhiram’s wife Chandana : టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పట్టాభిరామ్ అరెస్టుపై ఆయన సతీమణి చందన స్పందించారు. తనకు భర్తాకు ప్రాణ హానీ ఉందన్నారు. పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు. ఆయనకేమైనా జరిగితే డీజీపీ, సీఎం బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తలుపులు పగులకొట్టి మరీ తన భర్తను తీసుకెళ్లారని మండిపడ్డారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిని మాత్రం పట్టుకోలేదన్నారు.

ఎక్కడకి తీసుకెళుతున్నారో కూడా చెప్పలేదని వాపోయారు. తన భర్తను ఎలా తీసుకెళ్లారో… అలానే తమకు అప్పగించాలన్నారు. ఎఫ్.ఐ.ఆర్ కాపీ అడిగినా చూపించలేదని చెప్పారు. 50సి.ఆర్. పిసి కింద అరెస్టు నోటీసు మాత్రం ఇచ్చారని తెలిపారు. పోలీసులపై నమ్మకం లేకే ముందుగా వీడియో తీసి పంపామని వెల్లడించారు.

Nara Lokesh : ప‌ట్టాభికి ఏమైనా జ‌రిగితే ముఖ్యమంత్రిదే బాధ్యత, రాష్ట్రపతి పాలనకు డిమాండ్

తన భర్త పట్టాభి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. ఆయనకు ఏది జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీలదే బాధ్యత అన్నారు. 120 బీ సెక్షన్ కింద అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారని.. ఆయనేమైనా టెర్రరిస్టా అని ఆమె ప్రశ్నించారు.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంటి దగ్గరే పట్టాభిని అరెస్టు చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టాభి ఇంటి వద్ద ఉన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు పంపించేశారు. బారికేడ్లు పెట్టి.. అక్కడకు ఎవరినీ రాకుండా గట్టి బందోబస్తు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Pattabhi Arrest : టీడీపీ నేత పట్టాభి అరెస్టు

పట్టాభిని అరెస్ట్ చేసేందుకు రాత్రి 9 గంటల టైంలో పోలీసులు ఆయన ఇంటికి వద్దకు వెళ్లారు. ఆ టైంలో పట్టాభి తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉన్నారు. పట్టాభి బయటకు రావాలని మైక్ లో పోలీసులు కోరారు. కానీ ఆయన బయటికి రాలేదు. దీంతో పోలీసులు తలుపులు పగల గొట్టి ఇంట్లోకి వెళ్లి పట్టాభిని అరెస్టు చేశారు. పట్టాభిని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.