Nara Lokesh : ప‌ట్టాభికి ఏమైనా జ‌రిగితే ముఖ్యమంత్రిదే బాధ్యత, రాష్ట్రపతి పాలనకు డిమాండ్

టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో అలజడి రేపింది. పట్టాభి అరెస్ట్ ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్ర‌జ‌లను ర‌క్షించే పోలీసులైతే ప‌ట్టాభిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చే

Nara Lokesh : ప‌ట్టాభికి ఏమైనా జ‌రిగితే ముఖ్యమంత్రిదే బాధ్యత, రాష్ట్రపతి పాలనకు డిమాండ్

Nara Lokesh

Nara Lokesh : టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో అలజడి రేపింది. పట్టాభి అరెస్ట్ ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్ర‌జ‌లను ర‌క్షించే పోలీసులైతే ప‌ట్టాభిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి కానీ, దాడికి గురైన ప‌ట్టాభినే అరెస్ట్ చేశారంటే.. వీళ్లు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే
పోలీసులు కాద‌ని తేలిపోయింది అంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

Flipkart Discount Offer: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్.. చౌకగా 5G స్మార్ట్ ఫోన్!

” ఏపీలో ప్ర‌జ‌ల‌కీ, ప్ర‌తిప‌క్ష‌నేత‌ల‌కీ ర‌క్ష‌ణ లేదు. పట్టాభికి హాని త‌ల‌పెట్టాల‌ని పోలీసులు చూస్తున్నారు. త‌క్ష‌ణ‌మే ప‌ట్టాభిని కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాలి. బోస్‌డీకే అనేది రాజ‌ద్రోహం అయితే.. వైసీపీ నేత‌ల అస‌భ్య‌ భాష ఏ ద్రోహం కింద‌కి వ‌స్తుందో డీజీపీ చెప్పాలి. డ్ర‌గ్స్ గుట్టు ర‌ట్టు చేస్తున్నార‌నే ప‌ట్టాభిని అదుపులోకి తీసుకున్నార‌ని ప్ర‌జ‌ల‌కీ అర్థ‌మైంది. ఎన్ని దాడులు చేసినా, ఎంత‌మందిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా ప‌రిణ‌మించిన వైసీపీ డ్ర‌గ్స్ మాఫియా ఆట క‌ట్టించేవ‌ర‌కూ టీడీపీ పోరాటం ఆగ‌దు” అని నారా లోకేష్ అన్నారు.

కాగా, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణ కింద టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు… ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసులు వ్యవహరించిన తీరుపై పట్టాభి భార్య మండిపడ్డారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించలేదని, పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పారు.

Baldness : బట్టతల సమస్యతో బాధపడుతున్నారా…ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?..

పటమట పీఎస్ లో కేసు నమోదయిందని పోలీసులు చెప్పారని ఆమె తెలిపారు. పోలీసులు వచ్చినప్పుడు ఇంట్లో తాను, తన భర్త మాత్రమే ఉన్నామని చెప్పారు. తన భర్తకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు.

రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్..
మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రులకు లేఖలు రాశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కేంద్రం జోక్యం కోరారు చంద్రబాబు. ఏపీలోని ప్రతిపక్షానికి చెందిన ముఖ్య నేతలకు, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలకు.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు చంద్రబాబు.

పార్టీ కార్యాలయంపై వైసీపీ దాడులు.. వైసీపీ ప్రభుత్వ తీరును లేఖలో వివరించిన చంద్రబాబు. గంజాయి.. డ్రగ్స్, హెరాయిన్ వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. పేపర్ క్లిప్పింగులను.. వివిధ వీడియో క్లిప్పింగులను జత చేసి పంపారు. కుట్రపూరితంగా జరిగిన పార్టీ కార్యాలయాలపై దాడులు అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు కోరారు.

లా అండ్ ఆర్డర్ ను అధికార పార్టీ నేతలు చేతుల్లోకి తీసుకున్నారని, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం వంటి పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని లేఖలో తెలిపారు చంద్రబాబు.