Baldness : బట్టతల సమస్యతో బాధపడుతున్నారా…ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?..

నలభై ఏళ్లు దాటిన వారిలో ఇలా జుట్టు ఊడినా పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ మధ్యకాలంలో చిన్నవయస్సువారిలో సైతం బట్టతల సమస్య కనిపిస్తుంది. యువతో జుట్టుఊడిపోతూ బట్టతల కావటంతో నలుగురిలో తిరగలేని పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. ఆత్మన్యూనతకు గురవుతున్నారు.

Baldness : బట్టతల సమస్యతో బాధపడుతున్నారా…ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?..

Baldness

Baldness : జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. తలపై సహజంగా పెరిగే వెంట్రుకలు ఒకానొక వయస్సు వచ్చే సమయంలో రాలిపోవటం వల్ల బట్టతల ఏర్పడుతుంది. డెర్మటాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం రోజుకి యాభై నుంచి వంద వెంట్రుకలు రాలడం సహజం. కొందరిలో మాత్రం అంతకు మించి ఊడిపోతుంది. పురుషుల్లో బట్టతల రావటానికి భూమి ఆకర్షణ శక్తి కూడా కారణం అయ్యే అవకాశముందని, దీంతోపాటు టెస్టోస్టిరాన్‌లో మార్పులు కూడా కారణమని అమెరికా పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. టెస్టోస్టిరాన్‌లో మార్పుల వల్ల తలపై కొన్ని భాగాల్లో జట్టు ఊడిపోతుంది.

హెయిర్ ఫాలిసెల్స్ మూసుకుపోవడం వల్ల జుట్టు రాలడం అధికమౌతుంది. తలలో ఇన్ఫెక్షన్స్, ట్రూమా, డ్రగ్స్ తీసుకోవడం, మెడికల్ కండీషన్, అనీమియా, డైట్ లో మార్పులు, బర్త్ కంట్రోల్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ తీసుకోవడం, స్ట్రెస్, మోనోపాజ్, థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. జుట్టును కాపాడుకోవడానికి వివిధ రకాల చిట్కాలతో పాటూ, ఆన్ లైన్ లో దొరికే అనేక ఉత్పత్తులను వాడుతారు. అయినా సరే ఏమాత్రం ఫలితం ఉండదు.

నలభై ఏళ్లు దాటిన వారిలో ఇలా జుట్టు ఊడినా పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ మధ్యకాలంలో చిన్నవయస్సువారిలో సైతం బట్టతల సమస్య కనిపిస్తుంది. యువతో జుట్టుఊడిపోతూ బట్టతల కావటంతో నలుగురిలో తిరగలేని పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. ఆత్మన్యూనతకు గురవుతున్నారు. బట్టతల రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందువల్లో వస్తుందో తెలుసుకోవటం మంచిది.

తీసుకునే ఆహారంలో చక్కెర శాతం అధికంగా ఉండడం. అంటే స్వీట్లు, చాకోలెట్లు, కూల్ డ్రింకులు, ఇలా చక్కెర శాతం అధికంగా పదార్థాలు అధికంగా తినడం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. హై గ్లైసీమిక్ ఆహారాలు అంటే బ్రెడ్, కేక్స్, కుకీస్, నూనెలో వేయించిన వేపుళ్లు, చిప్స్, పైనాపిల్, ఖర్జూరం, కిస్ మిస్ వంటి వాటిని పరిమితంగా తీసుకోవటం మంచిది. శరీరానికి అన్ని విటమిన్లు కావాల్సినంత మోతాదులో అందకపోయినా జుట్టు రాలుతుంది. ఇలా విటమిన్ లోపం లేకుండా చూసుకోండి.

థైరాయిడ్ సమస్యలున్నవారికి కూడా వెంట్రుకలు అధికంగా రాలిపోతాయి. ప్రోటీన్ పొడులను తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. జుట్టు రాలడానికి ఇది కూడా కారణం కావచ్చని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో వారసత్వంగా కూడా బట్టతల వచ్చే ఛాన్సు ఉంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ జుట్టు రాలిపోవడం, హెయిర్ లాస్ వల్ల తలలో అక్కడక్కడ ప్యాచెస్‌గా ఏర్పడటం. తలకు బాల్డ్‌గా కనిపిస్తుంది. హెయిర్ లైన్ తగ్గడం, జుట్టు పల్చబడటం, గుండ్రటి ప్యాచ్‌లు, స్ట్రెస్, రాపిడ్ వెయిట్ లాస్, నెయిల్ సమస్యలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది.