×
Ad

పవన్‌ కల్యాణ్‌ ఒక మాట పదేపదే చెబుతుంటారు: చంద్రబాబు

విధ్వంసమైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం బాగు చేస్తోందని తెలిపారు.

chandrababu naidu

Chandrababu Naidu: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఒక మాట పదేపదే చెబుతుంటారని, ఏపీలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని అంటుంటారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం బాగు చేస్తోందని తెలిపారు.

“కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు పింఛను అందించాను. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె కుమార్తె చదువు ఆపేసి తల్లి బాగోగులు చూసుకుంటోంది. అలాంటి కుటుంబానికి పింఛను ఇవ్వడం ద్వారా ఒక సంతృప్తి. కూటమి ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైంది. మా కలయిక మాకోసం కాదు… ప్రజల కోసం.

మా జీవితాల్లో ఎప్పుడూ చూడని విజయం అందించారు ఈ విజయం తర్వాత మా బాధ్యత పెరిగింది. సూపర్ సిక్స్ హామీలు ఇస్తే…. అవి అసాధ్యమన్నారు ఇవాళ సూపర్ సిక్స్… సూపర్ సక్సెస్ చేశాం. 18 నెలల్లో కేవలం పింఛన్ల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్ల కోసం ఇంత ఖర్చు పెట్టడం లేదు.

Video: అంబులెన్స్‌ వైపు దూసుకొచ్చిన ఏనుగు.. డ్రైవర్‌ చాకచక్యంగా ఏం చేశాడంటే?

ఐదేళ్లలో లక్షా 65 వేల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నాం. 4 కోట్ల 90 లక్షల మంది జనాభాలో ప్రతి వంద మందిలో 13 మందికి పింఛన్లు అందుతున్నాయి. 59 శాతం మహిళలకే పింఛన్లు అందిస్తున్నాం ఒకప్పుడు ఒక నెల తీసుకోకపోతే వాటిని ఇచ్చేవారు కాదు. ఇప్పుడు రెండు మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించాం. ఒక పక్క అప్పులు…ఆదాయం లేదు అయినా చెప్పిన మాట చెప్పినట్టుగా చేసి చూపించాం.

స్త్రీ శక్తి ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాం. ఎంత ఖర్చయినా పర్వాలేదు ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడాలని స్త్రీ శక్తి అమలుచేస్తున్నాం. రైతాంగం బాగుండాలి…వారి జీవితాల్లో వెలుగు రావాలి రైతాంగం ఆదాయం మెరుగవ్వడం కోసం పంచ సూత్రాలు అమలుచేస్తున్నాం. త్వరలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం పోలవరం కుడి కాలువ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం… తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి బీపీ, షుగర్ రావడానికి ప్రధాన కారణం… మన ఆహారపు అలవాట్లు మారడమే. సమీకృత వ్యవసాయ విధానం ద్వారా….ఆరోగ్యం, ఆదాయం మెరుగవుతాయి” అని చెప్పారు.