Video: అంబులెన్స్ వైపు దూసుకొచ్చిన ఏనుగు.. డ్రైవర్ చాకచక్యంగా ఏం చేశాడంటే?
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Video: రోడ్డుపై ఒంటరిగా ఉన్న ఏనుగు అంబులెన్స్ వైపునకు దూసుకొచ్చింది. దీంతో మరయూర్, ఉడుమల్పేట అంతర్రాష్ట్ర మార్గంలో అంబులెన్స్ దాదాపు 10 నిమిషాలు నిలిచిపోయింది. ఆ తర్వాత ఏనుగు అడవిలోకి వెనక్కు వెళ్లింది.
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని చినార్ ఫారెస్ట్ చెక్‌పోస్ట్ దగ్గర ‘ఎస్’ వంగన వద్ద ఈ ఘటన జరిగింది. ఓ నిర్మాణ స్థలంలో కార్మికుడి కాలికి తీవ్ర గాయమైంది. అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఏనుగు ఒక్కసారిగా అడవిలోనుంచి బయటకొచ్చి దాదాపు 20 మీటర్లు నేరుగా అంబులెన్స్ వైపు పరిగెత్తింది.
అంబులెన్స్ డ్రైవర్ సెల్వా వెంటనే సైరన్, హారన్ రెండింటినీ ఆన్ చేశాడు. ఆ భారీ శబ్దం కారణంగా ఏనుగు రహదారి మధ్యలో ఆగింది. అంబులెన్స్ డ్రైవర్ హారన్, సైరన్‌ను ఆపుతూ, మోగిస్తూ ఉండడంతో ఏనుగు నెమ్మదిగా వెనక్కు తగ్గి అడవిలోకి వెళ్లింది.
Also Read: ఇంగ్లాండ్‌లో కత్తిపోటుకు గురై మృతి చెందిన భారత విద్యార్థి విజయ్ ఎవరు?
ఏనుగు పూర్తిగా అడవిలో కనబడకుండా పోయిన తరువాతే అంబులెన్స్‌ను డ్రైవర్ ఆసుపత్రి వైపునకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొండల ప్రాంతంలో మనుషులకు జంతువులు కలిగిస్తున్న ఆటంకాలు ఈ ఘటన ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చాయి. కేరళలోని కొండ ప్రాంతాల్లో తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
అక్టోబర్‌లో పాలక్కాడు జిల్లాలో స్థానిక అధికారులు ఒంటరి ఏనుగైన ‘కబాలి’ని అడవిలోకి తరలించాలని అటవీ శాఖను కోరారు. అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాలను అడ్డుకోవటం, దాడులు జరపటం వంటి సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండడంతో వారు అటవీ శాఖకు ఈ విజ్ఞప్తి చేశారు.
View this post on Instagram
