Chandrababu : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు.. పని బాగాలేకపోతే పక్కన పెట్టేస్తా : చంద్రబాబు

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తానని..పనితీరు బాగా లేకపోతే పక్కనపెట్టేస్తానని..పనిచేయకపోతే ఊరుకునేది లేదు..ఉపేక్షించేది లేదు అంటూ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Chandrababu on AP elections

Chandrababu on AP elections : ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అందరు కలిసి..కష్టపడి పనిచేయాలని సూచించారు. పనిచేసినవారిక తగిన గుర్తింపు ఉంటుందని..గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తానని..పనితీరు బాగా లేకపోతే పక్కనపెట్టేస్తానని స్పష్టంచేశారు.

రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అవసరం ఎంతో ఉందన్నారు. కాబట్టి నాయకులంతా కష్టపడి పనిచేయాలని.. పనితీరు ఏమాత్రం బాగోకపోతే ఏమాత్రం ఉపేక్షించేంది లేదని వార్నిగ్ ఇచ్చారు. పనితీరు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కానని తేల్చి చెప్పారు. తాను అంతర్గతంగా సర్వేలు చేయిస్తున్నానని ఆ సర్వేల్లో ఎవ్వరి పనితీరు బాగోకపోయినా ప్రత్యామ్నాయo చూపించి పక్కన పెడతానని అటువంటివారిని ఏమాత్రం ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేసేవారిని ఎలా గుర్తు పెట్టుకుంటానో పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు.

జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ పాలన గాలికొదిలేశాడు : నారా లోకేష్

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. నేతలంతా అప్రమత్తంగా ఉండాలని అలాగే ఓట్ల విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా బాధ్యత తీసుకోవాలన్నారు.ఓట్ల విషయంలో జరిగే అవకతవకల విషయాన్ని ఇన్ఛార్జ్ లు బాధ్యత గా తీసుకోవాలన్నారు. అన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుందులే అనే అలసత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించనని తేల్చి చెప్పారు.ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా నేతలు గుడ్ల కమ్మ వాగు గేటు కొట్టుకుపోయిన అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గేటు కొట్టుకుపోయిందని నేతలు విమర్శిస్తున్నారు. ఈరోజు ఉదయం సంఘటన స్థలానికి చంద్రబాబు వెళ్లి పరిశీలించారు.

కాగా..జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన తరువాత చంద్రబాబు ఓ పక్క తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తు .. మరోపక్క ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలని..రాష్ట్ర ప్రయోజనాల కోసం..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

టీడీపీ-జనసేనకు వైసీపీ చెక్..! కాపులను తమవైపు తిప్పుకునేలా వ్యూహం..!

 

ట్రెండింగ్ వార్తలు