Nara Lokesh : జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ పాలన గాలికొదిలేశాడు : నారా లోకేష్

ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందన్నారు.

Nara Lokesh : జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ పాలన గాలికొదిలేశాడు : నారా లోకేష్

nara lokesh

Updated On : December 9, 2023 / 12:15 PM IST

Nara Lokesh – Jagan : సీఎం జగన్ పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశాడని ఎద్దేవా చేశారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించక పోగా, ఉన్న వాటి నిర్వహణని పట్టించుకోలేదని విమర్శించారు.

ఈ మేరకు శనివారం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందన్నారు. గతేడాది గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయిందని తెలిపారు. నీరు వృథాగా పోతోందని తెలిపారు.

Vijayashanti : కేసీఆర్ హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటి?: విజయశాంతి

తునిలో లోకేష్ యువగళం పాదయాత్ర
మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అడుగు పెట్టింది. 217వ రోజు పాదయాత్ర 2,974 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా సందర్భంగా లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. చంద్రబాబు విడులయ్యాక లోకేష్ తిరిగి యువగళం పాదయాత్రను చేపట్టారు.