Chandrababu On Jagan
Chandrababu On Jagan : అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళి అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమపై జరిగిన వేధింపులను ఆర్యవైశ్య వర్గ నేతలు, వ్యాపారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని చంద్రబాబు అన్నారు. 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టిశ్రీరాములు అని అన్నారు. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ వేధింపులతో అంతటా రౌడీరాజ్యం అయిపోయిందని ధ్వజమెత్తారు. తనకు రౌడీయిజం తెలియదన్న చంద్రబాబు, తాను ఎప్పుడూ రౌడీలను ఉపేక్షించలేదన్నారు.(Chandrababu On Jagan)
Kodali Nani Hot Comments : జగన్ బతికుండగా.. సీఎం సీటుని టచ్ చేసే వాడు లేడు-కొడాలి నాని
ఈ ప్రభుత్వం వ్యాపారులను తీవ్రంగా వేధిస్తోందని, వసూళ్లకు పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జీఎస్టీతో పాటు జేఎస్టీ (జగన్ ట్యాక్స్) అదనంగా కట్టాల్సి వస్తోందని వాపోయారు. రాష్ట్రంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లిన రాజకీయ ఉద్దండడు కొణిజేటి రోశయ్య అని చంద్రబాబు కితాబిచ్చారు. రాష్ట్రంలో ఫైనాన్స్ మినిస్టర్ అంటే రోశయ్య పేరు గుర్తుకు వస్తుందన్నారు. రోశయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో రోశయ్య పేరు ఎందుకు పెట్టరు? అని జగన్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
Brother Anil Kumar : జగన్‌కు షాకివ్వనున్న బావ అనిల్ ?
రోశయ్యకు నివాళి ఘటించడానికి కూడా సీఎం జగన్ కు మనసు రాలేదన్నారు. మాజీ సీఎంలు వెంగళరావు, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి చనిపోతే…. ప్రభుత్వ సంస్థలకు వారి పేరు పెట్టి గౌరవించామని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కొణిజేటి రోశయ్యకు తగిన గౌరవం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కల్తీసారా వల్ల జంగారెడ్డిగూడెంలో ప్రజలు చనిపోతే… సీఎం జగన్ సహజ మరణాలు అనడం చాలా దారుణం అన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే… ఇక ఎవరూ ఇక్కడ బతకలేరు, బతకనివ్వరు అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలకు అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికార పక్షాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ టార్గెట్ చేసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఛాన్స్ చిక్కితే చాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు చంద్రబాబు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న వరుస మరణాలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ అంశాన్ని తమ ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు చంద్రబాబు. అవన్నీ నాటుసారా మరణాలే అని, ప్రభుత్వ హత్యలే అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అంతేకాదు సందర్భం వచ్చిన ప్రతిసారి.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని చంద్రబాబు అంటున్నారు. అంతేకాదు మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే.. మరిన్ని దారుణాలు జరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్ను ఎన్నికల్లో వైసీపీకి ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.