Chandrababu : భయపెట్టాలని చూస్తారా ? అస్సలు భయపడను – చంద్రబాబు

మానవ తప్పిదంతోనే తిరుపతిలో వరదలు పోటెత్తాయని, సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లో పోతున్నాడని విమర్శించారు.

Chandrababu Visit Chittur : తనను భయపెట్టాలని చూస్తారా ? అస్సలు భయపడను.. క్లైమోర్స్ మైన్స్ దాడికి చలించలేదు..తన సతీమణి గురించి మాట్లాడారు..బాధ అనిపించిందన్నారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. అసెంబ్లీని రద్దు చేయండి..ప్రజల్లోకి వెళుదామని సవాల్ విసిరారు. సీఎం జగన్ మానసికస్థితి రోజురోజుకు మారుతోందని, అసెంబ్లీలో మానసికంగా వేధించారని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తన గురించి మాట్లాడతారా..? నా ఇంటిపైన, పార్టీ కార్యాలయంపై దాడి చేశారని వెల్లడించారు. 2021, నవంబర్ 24వ తేదీ బుధవారం ఏర్పేడు మండలం పాపాయుడు పేటలో ఆయన పర్యటించారు.

Read More : Tragedy : తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి

వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులతో ఆయన మాట్లాడారు. వందల ఎకరాల వరి పంట నీట మునిగినట్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు రైతులు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మానవ తప్పిదంతోనే తిరుపతిలో వరదలు పోటెత్తాయని, సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లో పోతున్నాడని విమర్శించారు. అన్నమయ్య, పింఛా నదులు తెగిపోయాయని, కడప, చిత్తూరు జిల్లాలు జలవిలయంగా మారాయని గుర్తు చేశారు. ఈ సందర్భంలో…వరద ప్రాంతాల్లో పర్యటించాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడా అని ప్రశ్నించారు. వరద బాధితులు చచ్చిపోయిన తరువాత వచ్చి పరామర్సిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకునేంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారాయన.

Read More : Union Cabinet : మూడు వ్యవసాయ చట్టాల బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రాయలచెరువులో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మూడు రాజధాలనుపై సీఎం జగన్ యూ టర్న్ తీసుకున్నారని, పరిశ్రమలు పెట్టొద్దని సీఎం చెప్పారు కనుకే..అవి ఏపీకి రాలేదన్నారు. కొండపల్లిలో హైడ్రామా సృష్టిస్తున్నారని, అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా తట్టుకునే ధైర్యం సీఎం జగన్ కు లేదని, కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచారని మరోసారి ఆరోపణలు గుప్పించారు. పోలీసులు వైసీపీకి తొత్తుగా మారారని, తనదగ్గర పని చేయాల్సి ఉందని..గుర్తుంచుకోవాలని పోలీసులకు సూచించారు. తాను అవినీతికి పాల్పడ్డాడని ప్రచారం చేసిన వైసీపీ..నిరూపించలేకపోయిందన్నారు చంద్రబాబు.

ట్రెండింగ్ వార్తలు