Chandrababu : 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండీ .. లేదంటే తప్పుకోండీ : చంద్రబాబు వార్నింగ్

పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నేతలంతా అలెర్ట్ గా ఉండాలి. ప్రజలను చైతన్యం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలి. భవిష్యత్తుకు భరోసా పేరుతో ప్రజల్లో చైనత్యం తేవాల్సిన సమయం ఆసన్నమైంది.

Chandrababu Strong Warning to Party Activists

Chandrababu : మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో సోమవారం (జూన్ 19,2023) 10గంటలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. 175 స్థానాల్లో పోటీ చేయటానికి నేతలంతా సిద్ధంగా ఉండాలని..175 స్థానాల్లోను గెలిచేలా పనిచేయాలని..సూచించారు. దీంట్లో ఎవ్వరికి ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.ఒకవేళ పనిచేయటం ఇష్టం లేని నేతలు తప్పుకోవచ్చని..వారి స్థానంలో ప్రత్యామ్నాయ నేతలను పెట్టుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. నేతలు అంతా ఎలా పనిచేయాలో దిశానిర్ధేశం చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా కాస్త గట్టిగానే నేతలకు వార్నింగ్ లాంటి సూచనలు చేశారు.

పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నేతలంతా అలెర్ట్ గా ఉండాలని ప్రజలను చైతన్యం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తుకు భరోసా పేరుతో ప్రజల్లో చైనత్యం తేవాల్సిన సమయం ఆసన్నమైందని..సూచించారు. ఇది చాలా విలువైన సమయం అని ఎవ్వరు సమయాన్ని వృథా చేయకుండా పార్టీని అధికారంలోకి తేవటానికి పనిచేయాలని అలా పనిచేయనివారు ఇప్పుడే తప్పుకోవచ్చు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Adinarayana Reddy : పవన్ కల్యాణ్‌ని వైసీపీ ఏమయినా చేస్తుంది, కేంద్రం Y కేటగిరీ భద్రత కల్పించాలి : ఆదినారాయణ రెడ్డి

దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ రామారావు 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతు..ఇది మా పార్టీ అధినేత ఇచ్చిన వార్నింగ్ కాదని..గెలుపు కోసం ఎలా పనిచేయాలో చేసే సూచనలేనని అన్నారు. కొంతమంది పని చేయకుండా పదవులు కావాలనుకువారు ఇదొక వార్నింగ్ అనుకోవచ్చు..కానీ ఇది వార్నింగ్ కాదు సలహాలు సూచనలు అని తెలిపారు. భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ చేసే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని తీరాలని స్పష్టం చేశారని దాని కోసం చంద్రబాబు కాస్త గట్టిగానే చెప్పారని అన్నారు. ఇది నిజంగా ప్రతీ నాయకుడు పనిచేయాల్సిన సమయం సమయం వచ్చినప్పుడు పార్టీ అధినేత దిశానిర్ధేశం చేయటం సరైందేనని అదే చంద్రబాబు చేశారని అలా నిరంతరం తమను పనిచేసే విధంగా చేస్తుంటారని తెలిపారు.

మా అధినేత చెప్పినట్లుగానే పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు.క్రమశిక్షణ విషయంలో తాను ఎలా ఉంటారో నేతలు అంతా అలా ఉండాలని చంద్రబాబు మాకు ఎప్పుడు చెబుతుంటారు. కానీ కొంతమంది క్రమశిక్షణ తప్పే నేతలకు ఇది వార్నింగ్ అనే లనుకోవాలని.. అధినేత చెప్పినట్లుగానే తాము నడుచుకుంటామని అలా చేయనివారు ఎవరన్నా ఉంటే ఎలిమినేషన్ తప్పదు అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ రామారావు.

Chandrababu : ఏపీలో గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితి, హత్యలు,అత్యాచారాలకు అంతులేదు : చంద్రబాబు

మా నాయకుడు కోసం పార్టీని గెలిపించటం కోసం చంద్రబాబును మరోసారి సీఎంను చేయటానికి అందరం కలిసి పనిచేస్తామని పనిచేయనివారు పక్కకు తప్పుకోవాల్సిందేనని అన్నారు. అదే విషయం చంద్రబాబు కాస్త గట్టిగా చెప్పారని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామారావు తెలిపారు.

కాగా ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యనేతలంతా హాజజరయ్యారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా ఎలా పనిచేయాలో చంద్రబాబు దిశానిర్ధేశం చేస్తు పనిచేయని నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు