Chandrababu : ఏపీలో గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితి, హత్యలు,అత్యాచారాలకు అంతులేదు : చంద్రబాబు

గేటెడ్ కమ్యూనిటీల తరహాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే వాటికి వైసీపీ రంగులేసి వైఎస్ బొమ్మ పెట్టారు.అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు.విశాఖలో అక్రమాలకు భయపడి ఎంపీ ఎంవీవీ తన ఆఫీసును హైదరాబాదుకు మార్చుకున్నారు.

Chandrababu : ఏపీలో గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితి, హత్యలు,అత్యాచారాలకు అంతులేదు  : చంద్రబాబు

Chandrababu

Chandrababu Fire On YS Jagan : ఏపీలో శాంతి భద్రతలు లేనే లేవు,తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నిస్తే ఓ పదో క్లాస్ పిల్లాడి నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి తగులపెట్టారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు. గంజాయి తాగిన వెధవలు ఇలాంటి పని చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గంజాయి తాగిన వెధవలను సీఎం జగన్ తయారు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గంజాయి తాగే వెధవలకు తల్లు చెల్లి తేడా తెలియదని…గంజాయి తాగే వెధవలను రోడ్ల మీదకు వదిలేస్తారా..?అంటూ ప్రశ్నించారు.

అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారని అదీ ఏపీలో ప్రస్తుత దారుణ పరిస్థితులు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖలో అక్రమాలకు భయపడి ఎంపీ ఎంవీవీ తన ఆఫీసును హైదరాబాదుకు మార్చుకున్నారని ఇలా సొంతపార్టీ నేతలకే భద్రతలేదన్నారు. ఏపీలో ఉండలేమని అధికార పార్టీ ఎంపీనే హైదరాబాదుకు వెళ్లిపోయాయని అంత దారుణంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయన్నారు.

Chintamaneni: భుజాలపై ఎక్కించుకుని పవన్ కల్యాణ్ ను గెలిపిస్తా.. చింతమనేని కీలక వ్యాఖ్యలు

ఏపీలో అవినీతి, అసమర్ధ, నేరస్తుల పాలన ఉందని…గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితి ఉందంటూ విమర్శించారు. ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని..దేశంలో మరెక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో అధికంగా ఉన్నాయని ప్రజలు అధిక ధరలతో నానా ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. నిత్యావసరాల విపరీతంగా పెరిగాయి,

ఇంటి పన్ను, చెత్తపన్ను ఇలా అన్నింటినీ పెంచేసి ప్రజలపై అన్యాయంగా పన్నులు రుద్దుతున్నారంటూ మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచేశారని అన్నారు.అభివృద్ధి చేస్తేనే భూముల ధరలు పెరుగుతాయని కానీ అభివృద్ధి అనేమాటలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో భూముల విలువలు తగ్గాయి కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయన్నారు.కొత్త జిల్లా కేంద్రాల్లో భూమి విలువలు పెరగపోయాని రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం పెంచేశారని విమర్శించారు.

Also Read: ఆ రోజు నేను నోరు విప్పి ఉంటే ఇతడు ఉండేవాడు కాదు: పవన్ కల్యాణ్

మద్యంలో జగన్ బ్రాండ్లు వచ్చాయి…రాబోయే రోజుల్లో కూడా తాగుడును కూడా తాకట్టు పెట్టేసిన చరిత్ర జగన్ ది అంటూ మండిపడ్డారు.గేటెడ్ కమ్యూనిటీల తరహాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే వాటికి వైసీపీ రంగులేసి వైఎస్ బొమ్మ పెట్టారంటూ ఎద్దేవా చేశారు.ఎవడికో పుట్టిన బిడ్డను తనకే పుట్టారని చెప్పుకునే దరిద్రుడు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో ఎవ్వరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితే లేదనీ..రాజకీయాల్లో మహిళలు ఉత్సాహంగా ఉండటాన్ని కూడా కించపరుస్తు వారిని అవమానిస్తు వేధిస్తున్నారని అన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే భయపడతామనుకున్నారు..కానీ టీడీపీ భయపడేదే లేదని చంద్రబాబు స్పష్టంచేశారు.