Chandrababu
Ap news: ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా.. ఇదేం బాదుడు, ఇదేం పాలన అంటూ వైసీపీ సర్కార్ ను చంద్రబాబు ప్రశ్నించారు. పన్ను పోటుపై ప్రజల ప్రశ్నలకు బదులివ్వండి.. లేదా అసత్య హామీలు, నిత్య మోసాలపై క్షమాపణలు చెప్పండి అంటూ చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంతకీ చంద్రబాబుకు అంత కోపమెందుకొచ్చింది అనుకుంటున్నారా..
Vasireddy Padma On Chandrababu : చంద్రబాబుకి నోటీసులు ఇవ్వలేదు, కేవలం ఆహ్వానం పంపాము-వాసిరెడ్డి పద్మ
వైసీపీ ప్రభుత్వం హయాంలో పన్నుల బాదుడు ఎలా ఎందో వివరిస్తూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి వాయిస్ మెసేజ్ ను ట్వీటర్ లో పోస్టు చేశాడు. గతంలో రూ.3వేలు ఇంటి పన్ను ఉంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో అది రూ. 5,700 కు చేరిందని సదరు వ్యక్తి ట్విటర్ లో పోస్టు చేసిన వాయిస్ మెసేజ్ లో పేర్కొన్నాడు. అంతేకాక ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, లైటింగ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, లైబ్రరీ ట్యాక్స్, అనాథరైజ్డ్ ఫెనాలిటీ, టాక్స్ ఏరియల్ ఇంట్రస్ట్ పేరుతో తనకు పన్నులు ఎలా వడ్డించారో వివరిస్తూ విజయవాడకు చెందిన వ్యక్తి ట్విటర్ లో తెలిపాడు.\
మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా! ఇదేం బాదుడు… ఇదేం పాలన?
పన్ను పోటుపై ప్రజల ప్రశ్నలకు బదులివ్వండి… లేదా అసత్య హామీలు, నిత్య మోసాలపై క్షమాపణలు చెప్పండి.#BaadudeBaaduduByJagan pic.twitter.com/n72hlMuoya
— N Chandrababu Naidu (@ncbn) April 27, 2022
అంతేకాక భారీగా పెరిగిన పన్నులతో పేద, మధ్య తరగతిపై పడుతున్న భారాన్ని వివరించాడు. విజయవాడ వాసిగా తన విన్నపాన్ని మన్నించి పన్నుల బాదుడు నుంచి రక్షించాలంటూ ప్రభుత్వానికి వాయిస్ మెసేజ్ ద్వారా విజయవాడ వాసి ట్వీట్ చేశాడు. అయితే అదే మెసేజ్ ను ట్యాగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా, ఇదేం బాదుడు, ఇదేం పాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుపోటుపై ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వం కచ్చితంగా సమాధానం ఇవ్వాలని, లేకుంటే అసత్య హామీలు, నిత్య మోసాలపై క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు సమాధానం ఇస్తారా? లేకుంటే చంద్రబాబు ట్వీట్ ను లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.