Kodali Nani : చంద్రబాబు ఇక ఎప్పటికీ సీఎం కాలేరు- కొడాలి నాని

ఇక జన్మలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. సీఎం జగన్‌పై బురద జల్లడమే ఓ వర్గం మీడియా పనిగా పెట్టుకుందని, ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనం రాస్తున్నారని ధ్వజమెత్తారు.

Kodali Nani

Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఇక జన్మలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. ఏపీ ధాన్యం కిలో రూ.25కే విదేశాలకు ప్రభుత్వం ఎగుమతి చేస్తోందనే ఆరోపణలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఓ వర్గం మీడియా ఇలాంటి తప్పుడు రాతలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌పై బురద జల్లడమే ఓ వర్గం మీడియా పనిగా పెట్టుకుందని, ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనం రాస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కొడాలి నాని.

Kodali Nani : కమ్మ, కాపుల మధ్య మళ్లీ వివాదాలు సృష్టించాలని చూస్తున్నారు- కొడాలి నాని

కాకినాడ పోర్టు నుంచి అనేక రాష్ట్రాల ధాన్యం ఎగుమతి అవుతోందని తెలిపిన మంత్రి.. ధాన్యం ఎగుమతి చేయడంలో కాకినాడ పోర్టుది అగ్రస్థానమని చెప్పారు. రైతులు పండించే పంటల వివరాలు ఈ క్రాప్‌ యాప్‌లో ఉంటాయని, అన్నీ రికార్డులు ఆన్ లైన్ లో ఉంటాయని వివరించారు. సన్నబియ్యం ఎగుమతిలో ఎలాంటి అవినీతి జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ఒక్క ఏపీ నుంచే కాదని.. బీహార్, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతి అవుతోందన్నారు.

గతంలో ధాన్యాన్ని మిల్లులో కొనుగోలు చేస్తే తాము రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నామని మంత్రి కొడాలి నాని చెప్పారు. పేదల కోసం పనిచేసే సీఎంపై ఇన్ని అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. విజయవాడలో బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్‌ను తమ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయించి పూర్తి చేశామన్నారు. మొత్తం 51 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసింది చంద్రబాబుకి కనపడటం లేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ బలపడతారని చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మంత్రి అన్నారు. చంద్రబాబు ఎంతమంది డీజీపీలను, ఎంతమంది చీఫ్ సెక్రటరీలు మార్చాడో చెప్పాలని మంత్రి కొడాలి నాని నిలదీశారు.

Kodali Nani : అశోక్ బాబు తప్పు చేశారు, త్వరలో మళ్లీ 3 రాజధానుల బిల్లు-మంత్రి కొడాలి నాని

సవాంగ్ వచ్చి చాలా కాలమైందని.. వేరే వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం డీజీపీని మార్చిందని కొడాలి నాని వివరణ ఇచ్చారు. ప్రజలు అమాయకులు కాదని.. జగన్ ని భ్రష్టు పట్టించడం చంద్రబాబు వల్ల కాదని కొడాలి నాని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ చావుకి కారణమై సీఎం పదవి తెచ్చుకుని.. దానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుబేరుడు అయ్యాడని కొడాలి నాని ఆరోపించారు.