Kodali Nani : కమ్మ, కాపుల మధ్య మళ్లీ వివాదాలు సృష్టించాలని చూస్తున్నారు- కొడాలి నాని

రాష్ట్రానికి మధ్యలో ఉంది కనుక.. రాజధానిని అమరావతిలో ఉంచాలని టీడీపీ నేతలు అంటారు.. మరి అదే ఫార్ములా హిందూపురంకి వర్తించదా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

Kodali Nani : కమ్మ, కాపుల మధ్య మళ్లీ వివాదాలు సృష్టించాలని చూస్తున్నారు- కొడాలి నాని

Kodali Nani Chandrababu

Kodali Nani : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న విమర్శలను మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. కొత్త జిల్లాలపై కూడా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినా వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాల పునర్విభజన అంశంలో కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టుగా టీడీపీ నేతల వైఖరి ఉందని విమర్శించారు.

హిందూపురంని జిల్లా కేంద్రం చేయలేదని బాలకృష్ణ చేస్తున్న విమర్శలపై కొడాలి నాని స్పందించారు. పుట్టపర్తి అందరికీ మధ్యగా ఉంటుంది. పరిపాలనకు అనువుగా ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతం. పార్లమెంటుకి మధ్యలో ఉంటుంది. కనుకే జిల్లా కేంద్రం అక్కడ పెట్టారని మంత్రి వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి మధ్యలో ఉంది కనుక.. రాజధానిని అమరావతిలో ఉంచాలని టీడీపీ నేతలు అంటారు.. మరి అదే ఫార్ములా హిందూపురంకి వర్తించదా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

Reliance Jio New Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు మారాయి.. చెక్ చేసుకోండి..!

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అందుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని మంత్రి అన్నారు. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా దీక్షలు చేస్తుంటే చంద్రబాబు గుడ్డివాడిలా మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ బతికుండగానే వెన్నుపోటు పొడిచారు.. చనిపోయాక కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు అని వాపోయారు. ఎన్టీఆర్ మచిలీపట్నం పార్లమెంటులో పుట్టారు.. రంగా కాటూరిలో పుట్టారు.. ఇద్దరిది మచిలీపట్నం పార్లమెంటులోనే ఉంది అని మంత్రి అన్నారు. పాదయాత్ర సమయంలో ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిమ్మకూరులో అక్కడి ప్రజలు జగన్ ని అడిగారు.. సరేనని జగన్ వారికి మాట ఇచ్చారని మంత్రి తెలిపారు. విజయవాడ పేరున్న ప్రాంతం కనుక ఎన్టీఆర్ పేరు పెట్టారని వివరించారు. అయితే, టీడీపీ నేతలు తీసేయ్యాలని అనడం దారుణం అన్నారు.

”రంగాపై టీడీపీకి ప్రేమ ఉంటే అధికారంలో ఉండగా చంద్రబాబు ఎందుకు పెట్టలేదు? ఎన్టీఆర్, రంగాలను ఇద్దరినీ చంపింది చంద్రబాబు అండ్ కో నే. మళ్లీ ఇద్దరి ఫొటోలు పెట్టి దండలు వేస్తున్నారు. రంగా పేరు పెట్టించుకోవాలని రాధాకి ఉంటే మచిలీపట్నంకి పెట్టాలని ఆయన కోరేవారు. కమ్మ, కాపు కులాలపై మళ్లీ వివాదాలు సృష్టించాలని టీడీపీ నేతలు చూస్తున్నారు” అని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

Copper Rings : రాగి ఉంగరాలు, కడియాలు ధరిస్తే ఏమౌతుందో తెలుసా?

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్.. రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను మంత్రి కొడాలి నాని ఖండించారు. దొంగ సర్టిఫికెట్లతో అశోక్ బాబు ప్రమోషన్ పొందారని ఆరోపించారు. ఇంటర్ చదివి డిగ్రీ చదివినట్టు సర్టిఫికెట్లు పెట్టారని అన్నారు. అశోక్ బాబుపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయలేదని, సహ ఉద్యోగి ఫిర్యాదు చేశారని మంత్రి వెల్లడించారు. అయినా టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. తప్పు చేసినందుకే అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేసిందని తేల్చి చెప్పారు.