Copper Rings : రాగి ఉంగరాలు,కడియాలు ధరిస్తే ఏమౌతుందో తెలుసా?..

రాగి ఉంగరాలు, కడియాలు ధరించటం వల్ల కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తొలగిపోతాయని నమ్ముతారు. ఆర్ధరైటిస్ తో బాధపడుతున్న రోగులు తప్పనిసరిగా రాగితో తయారు చేసిన బ్రాస్ లైట్, కడియాలను ధరిస్తుంటారు.

Copper Rings : రాగి ఉంగరాలు,కడియాలు ధరిస్తే ఏమౌతుందో తెలుసా?..

Copper Rings

Copper Rings : పురాతన కాలంలో నుండి మన దేశంలో రాగిని అత్యంత పవిత్రమైనదిగా బావిస్తారు. రాగి చెంబులు, బిందెలను మన పూర్వికులు ఎక్కువగా వినియోగించేవారు. రాగి చెంబులో నిల్వ ఉంచిన నీటిని పవిత్ర జలంగా , ఆరోగ్యానికి మేలు కలిగించేదిగా భావించి సేవించేవారు. అనేక పరిశోధనల్లో సైతం ఇది నిజమేనని నిరూపితమైంది. అంతేకాకుండా రాగిని ఉంగరాల రూపంలో వేళ్ళకు, కడియాల రూపంలో చేతులకు కాళ్ళకు ధరించే అలవాటు నేటికీ కొనసాగుతుంది.

రాగి ఉంగరాలు, కడియాలు ధరించటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చాలా మంది భావిస్తారు. ఆయుర్వేద శాస్త్రాల్లోసైతం రాగి ఉంగరం ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించటం జరిగింది. ముఖ్యంగా వేడి అధికంగా ఉండే ప్రాంతాలలో ఉండే వారు సూర్య కిరణాల ప్రభావం కారణంగా శరీరంలో ఏర్పడే రుగ్మతలను నివారించటంలో రాగి ఉంగరాలు, కడియాలు దోహదపడతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే రాగి ఉంగరాలు , కడియాలు ధరిస్తే అవి కొంతకాలానికి నల్లగా మారిపోయి వర్ణాన్ని కోల్పోతాయి.

రాగి ఉంగరాలు, కడియాలు ధరించటం వల్ల కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తొలగిపోతాయని నమ్ముతారు. ఆర్ధరైటిస్ తో బాధపడుతున్న రోగులు తప్పనిసరిగా రాగితో తయారు చేసిన బ్రాస్ లైట్, కడియాలను ధరిస్తుంటారు. శరీరంలో విషపదార్ధాలను తొలగించటంతో రాగి సహాయకారిగా పనిచేయటంతోపాటు హార్మోన్ల పనితీరును సమతుల్యం చేస్తుందని నిపుణులు చేబుతున్నారు. ఒత్తిడిని తగ్గించటంతోపాటు, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తప్పుతుంది. రక్త సరఫరా సవ్యంగా సాగటంలో ఇది తోడ్పడుతుంది. అధిక రక్తపోటు సమస్యలను తొలగించటంలో దోహదపడుతుంది.

అంతే కాకుండా వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంత మంది రాగి రింగులను ధరిస్తుంటారు. ఇలా ధరించటం వల్ల గ్రహాలు అనుకూలిస్తాయని నమ్ముతుంటారు. వాస్తు దోషం తొలగిపోతుందని నమ్ముతారు. సమాజంలో గౌరవ మర్యాదు పెరుగుతాయని భావిస్తారు. మరోవైపు ఇటీవలి కాలంలో బంగారం ధరలు పెరుగుతున్న నేపధ్యంలో సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేయలేని స్ధితిలో ఉన్నారు. ఈ క్రమంలో అనేమంది సామాన్యులు అందుబాటులో ధరలో ఉన్న రాగి రింగులు, కడియాలు, బ్రాస్ లైట్లను కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు.