Reliance Jio New Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు మారాయి.. చెక్ చేసుకోండి..!

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. జియో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు మారాయి..

Reliance Jio New Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు మారాయి.. చెక్ చేసుకోండి..!

Reliance Jio New Plans Reli

Reliance Jio New Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. జియో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు మారాయి.. కొత్తగా సవరించిన జియో ప్రీపెయిడ్ ధరల్లో మార్పులను ఓసారి చెక్ చేసుకోండి.. రిలయన్స్ జియో డిసెంబర్ 1, 2021లోనే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను (Jio Prepaid Plans) పెంచేసిన సంగతి తెలిసిందే. దేశీయ టెలికం పోటీదారులైన భారతీ ఎయిర్ టెల్ (Airtel Prepiad Tariffs), వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) ప్రీపెయిడ్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన తర్వాత జియో కూడా తమ ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచింది.

ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ మొత్తం జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను దాదాపు 20 శాతం వరకు సవరించింది. ప్రస్తుతం జియో యూజర్లు తమ రీఛార్జ్ ప్లాన్లపై అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ నెలవారీ/వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా యాడ్ ఆన్ ప్లాన్‌ల ధరలను కూడా జియో పెంచేసింది. చాలామంది జియో యూజర్లకు పెరిగిన కొత్త ప్రీపెయిడ్ ధరలపై గందరగోళం నెలకొంది. జియో యూజర్లు ఏదైనా రీఛార్జ్ చేయడానికి ముందు Jio ప్రీపెయిడ్ ఛార్జ్ ప్లాన్‌ల కొత్త ధరలను ఓసారి చెక్ చేసుకోండి. Reliance Jio ఇప్పటికే అందిస్తున్న అన్ని ప్యాక్‌ల రేట్లను 28 రోజుల నుంచి 365 రోజుల చెల్లుబాటుతో సవరించింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఏయే ప్లాన్లలో ఎంత పెరిగాయంటే? :
28 రోజుల వ్యాలిడిటీతో రూ. 199 ప్లాన్ రీఛార్జ్ ఇప్పుడు రూ. 239కు మారింది. ఈ ప్లాన్ 28 రోజుల కాలపరిమితిపై రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. గతంలో 28 రోజుల పాటు 2GB రోజువారీ డేటాను అందించే ప్లాన్ ధర రూ. 299లకు పెంచింది. మరో ప్లాన్ రూ. 399 ప్లాన్ రేటును 56 రోజుల వ్యాలిడిటీతో రూ. 479కి సవరించింది. 56 రోజుల పాటు ప్రతిరోజూ 1.5GB డేటాను అందిస్తుంది. అదేవిధంగా, 2GB డేటా/రోజు, 56 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు రూ.444 నుంచి రూ.533లకు పెరిగింది.

ఇక.. 84 రోజుల రూ. 329 ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ. 395కి పెంచింది. ఈ ప్లాన్ కింద మొత్తం 6GB డేటాతో పాటు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రూ.555 ప్యాక్‌పై రోజుకు 1.5GB డేటాతో రూ.666కు సవరించింది. ఈ ప్లాన్‌ల వాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. 2GB/డెయిలీ ప్యాక్ ధర ఇప్పుడు రూ. 599 నుంచి రూ.719కు పెరిగింది. రూ. 1,299 ప్లాన్‌పై 336 రోజులతో ధర 1,559 కు సవరించింది.

వార్షిక రీఛార్జ్ ప్లాన్ రూ. 2,399 ధర రోజుకు 2GB డేటాతో రూ. 2,879కి పెరిగింది. రిలయన్స్ జియో టాప్ అప్ ప్యాక్ (Top-UP pack) ధరను కూడా సవరించింది. రూ.51 యాడ్ ఆన్ ప్లాన్ ధర రూ.61కి, రూ.101 ప్యాక్ రూ.121 ప్యాక్‌, రూ.251 నుంచి రూ.301కి 6GB, 12GB, 50GB డేటాతో వరుసగా ప్యాక్ ధరలన్నీ పెంచేసింది.

Read Also : Polytechnic Exam: పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు