Polytechnic Exam: పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు

తెలంగాణలో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైయ్యాయి. ఫిబ్రవరి 8 నుంచి పాలిటెక్నిక్ పరీక్షలు ప్రారంభంకాగా.. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ లీకైంది.

Polytechnic Exam: పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు

Exam

Polytechnic Exam: తెలంగాణలో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైయ్యాయి. ఫిబ్రవరి 8 నుంచి పాలిటెక్నిక్ పరీక్షలు ప్రారంభంకాగా.. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ లీకైంది. ఇతర జిల్లాల్లోని కాలేజీ ప్రిన్సిపాళ్లు ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించి బోర్డుకు సమాచారం అందించడంతో వారి రంగంలోకి దిగారు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేయడంతో పేపర్ ను గుర్తించిన బోర్డు సెక్రెటరీ.. ప్రశ్నపత్రం పైనున్న వాటర్ మార్క్ ఆధారంగా..అవి ఏ సెంటర్ నుంచి లీకైయ్యాయనే విషయాన్ని కనిపెట్టారు. హైదరాబాద్ నగర శివారు బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ప్రశ్నాపత్రాలు లీక్‌ అవుతున్నట్లు గుర్తించిన పాలిటెక్నిక్ బోర్డు అధికారులు.. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read: Indonesia crocodile : మొనగాడొచ్చాడు..13 అడుగుల మొసలి మెడలో టైర్ తీసాడు..రూ.కోట్ల బహుమతిని ఏంచేశాడంటే..

బోర్డు అధికారుల ఫిర్యాదు మేరకు స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేపర్ ఎలా లీకైందనే విషయంపైనా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ లోని ఛేగుంట పాలిటెక్నిక్ కాలేజీలో ఎగ్జామ్ టైం దాటుతున్నా.. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో కాలేజీ స్టాఫ్ కు అనుమానం వచ్చింది. అనంతరం విద్యార్థుల ఫోన్లను తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది. ప్రశ్నపత్రంపై ఉన్న వాటర్ మార్క్ ఆధారంగా అది స్వాతి కాలేజీలోని ఎగ్జామ్ కేంద్రానికి చెందినదిగా గుర్తించిన చేగుంట కాలేజీ ప్రిన్సిపాల్.. ఈ విషయాన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్వాతి కాలేజీ ఎగ్జామ్ సెంటర్ ను విద్యాశాఖ రద్దు చేసింది.

Also read: Tollywood Meeting : సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం చివరి సమావేశం.. మెగా మీటింగ్ ఫలించిందా??

పేపర్ లీకేజ్ ఘటనపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈఘటనపై స్వాతి కాలేజ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణమూర్తి స్పందిస్తూ..తమ కాలేజీ నుండి ప్రశ్నపత్రం లీకైందన్న విషయం తెలియదని అన్నారు. ఎగ్జామ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించి ప్రశ్నపత్రాలను అందించేందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఒక అబ్జర్వేటర్ వస్తాడు.. అతనితో పాటు కాలేజీ సిబ్బంది ఇద్దరు ఉంటారు.. ముగ్గురు కలిసి పేపర్ ను ఓపెన్ చేసి ఇన్విజిలేటర్ లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈక్రమంలో సిబ్బంది ఎవరైనా ఈ అక్రమాలకు పాల్పడి ఉంటారని అటు కళాశాల యాజమాన్యం, ఇటు పోలీసులు భావిస్తున్నారు. ఎగ్జామ్ పేపర్ లీకైందన్న విషయం తెలిసి తమ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్ ను రద్దు చేశారని స్వాతి కాలేజ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణమూర్తి 10టీవీ ప్రతినిధితో అన్నారు.

Also read: Deepika Padukone : ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై దీపికా పదుకునే వ్యాఖ్యలు