12న సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం.. ఈ ప్రాంతాల గుండా వాహనదారులు వెళ్లొద్దు

 ఏపీ సీఎంగా చంద్ర‌బాబు నాయుడు ఈనెల 12న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు పూర్త‌వుతున్నాయి.

Traffic Restrictions

Traffic Restrictions :  ఏపీ సీఎంగా చంద్ర‌బాబు నాయుడు ఈనెల 12న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు పూర్త‌వుతున్నాయి. ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు, ఇత‌ర రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు, ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు, ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. ఈ సంద‌ర్భంగా అధికారులు ప్ర‌మాణ స్వీకారం జ‌రిగే ప్రాంతాల్లో ఆంక్ష‌లు విధించారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగే ప్రాంతంలోని ప‌లు మార్గాల్లో వాహ‌నాలు రాకుండా ఇత‌ర మార్గాల్లోకి ట్రాఫిక్ ను మ‌ళ్లించారు.

Also Read : ఏపీలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం.. స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు

  • విశాఖ పట్నం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలను ..
    కత్తిపూడి నుండి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు.
    విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లివచ్చే వాహనాలను కత్తిపూడి నుండి ఒంగోలు వైపు మళ్లించడం జరిగింది.
  • చెన్నై నుండి విశాఖపట్నం వైపువ‌చ్చే వాహనాలు..
    ఒంగోలు నుండి రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నరసాపురం – అమలాపురం – కాకినాడ – కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు మ‌ళ్లించారు.
    బుడంపాడు నుండి తెనాలి – పులిగడ్డ – మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నర్సాపురం – కాకినాడ – కత్తిపూడి వైపు మళ్లింపు.

Also Read : మంత్రివర్గం కూర్పుపై చంద్రబాబు కసరత్తు.. ఉమ్మడి జిల్లాల వారిగా రేసులో ఉంది వీరే..

  • విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను ..
    గామన్ బ్రిడ్జి – దేవరపల్లి – జంగారెడ్డిగూడెం – అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ కు.
    భీమడోలు – ద్వారకాతిరుమల – కామవరపుకోట – చింతలపూడి నుండి ఖమ్మం వైపు.
    ఏలూరు బైపాస్ నుండి – జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు.
    ఏలూరు బైపాస్ – చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా.
    హనుమాన్ జంక్షన్ – నూజివీడు, మైలవరం – ఇబ్రహీంపట్నం – నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు.
  • హైదరాబాద్ నుండి విశాఖపట్నం వైపువెళ్లే వాహనాలను..
    నందిగామ – మధిర – వైరా – సత్తుపల్లి – అశ్వరావుపేట – జంగారెడ్డిగూడెం – దేవరపల్లి – గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు.
    ఇబ్రహీంపట్నం – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.
    రామవరప్పాడు – నున్న – పాముల కాలువ – వెలగలేరు – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ – ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.
    విజయవాడ నుండి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు – తాడిగడప – కంకిపాడు – పామర్రు – గుడివాడ నుండి భీమవరం వైపు.

పైన తెలిపిన ట్రాఫిక్ మళ్లింపును ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలను కొనసాగించాలని, త‌ద్వారా పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

 

ట్రెండింగ్ వార్తలు