మంత్రివర్గం కూర్పుపై చంద్రబాబు కసరత్తు.. ఉమ్మడి జిల్లాల వారిగా రేసులో ఉంది వీరే..

మంత్రి పదవులకోసం తీవ్ర పోటీ ఉండగా.. సమర్ధులకే అవకాశం ఉంటుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మంత్రివర్గం కూర్పుపై చంద్రబాబు కసరత్తు.. ఉమ్మడి జిల్లాల వారిగా రేసులో ఉంది వీరే..

AP Cabinet Ministers

AP Cabinet Ministers : టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేయనున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండడంతో టీంను సిద్ధం చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ ఉండగా.. సమర్ధులకే అవకాశం ఉంటుందంటూ సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారిగా మంత్రుల ఎంపిక ఉండబోతుంది. ఒకరిద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని సమాచారం. ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేనకు మూడు నుంచి నాలుగు బెర్త్ లు వస్తాయని ప్రచారం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలుస్తోంది. ఇక బీజేపీకి రెండు బెర్త్ లు ఖాయమని టీడీపీ వర్గాలు తెలిపాయి. బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మైనార్టీలకు క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది.

Also Read : కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన నడ్డా, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్

శ్రీకాకుళం జిల్లా నుంచి రేసులో అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, అశోక్, కూనరవికుమార్, మురళి ఉన్నారు.
విజయనగరం నుంచి కళా వెంకట్రావు, సంధ్యారాణికి అవకాశం దక్కవచ్చు.
విశాఖపట్టణం నుంచి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ రావు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాల్లో జ్యోతుల నెహ్రూ, చిన్నరాజప్ప, యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరితో పాటు రామానాయుడు, రఘురామ రాజు రేసులో ఉన్నారు.
కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమ, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ, కొల్లు రవీంధ్ర పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా నుంచి నారా లోకేశ్, దూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్.
ప్రకాశం జిల్లా నుంచి గొట్టుపాటి రవి, వీరాంజనేయ స్వామి.
నెల్లూరు నుంచి నారాయణ, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పదవిని ఆశిస్తున్నారు.
చిత్తూరు జిల్లా నుంచి కిశోర్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది.
అనంతపురం జిల్లా రేసులో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, గుమ్మనూరి జయరాం.
కడప నుంచి మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ కోటాలో రాంభూపాల్ రెడ్డి, పుట్టా సుధాకర్ పేర్లు పరిశీలిస్తున్నారు.
కర్నూల్ జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, అఖిలప్రియ, బీసీ జనార్దన్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డిలో ఒకరిద్దరికి మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది.

Also Read : వైసీపీ అందుకే ఓడిపోయింది: జగన్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, ఆరణి శ్రీనివాసులు, కందుల దుర్గేశ్, పంతం నానాజీ, వంశీకృష్ణ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ నుంచి రేసులో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, సత్యకుమార్, పార్ధసారధి, ఆదినారాయణ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.