Karumuri Nageshwara Rao : అది తెలిస్తే చంద్రబాబు గుండె ఆగిపోతుంది : మంత్రి కారుమూరి

రాగులు, జొన్నలు పండించే వారికి సబ్సిడీలు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలనే ముందు చూపుతో సీఎం వైఎస్ జగన్ ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారని కొనియాడారు.

Karumuri Nageshwara Rao

Karumuri Comments Chandrababu : పుంగనూరు లో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పని రాక్షసులను చూడలేదని చెప్పారు. దేవుడి కృప ఆయనపై ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఇక్కడి నుండి గోధుమ పిండి, ఫెర్టిఫైడ్ చెక్కి పంపిణీ ప్రారంభించడం గొప్పగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఏడాదికి 240 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో రేషన్ కార్డుదారులకు రాగులు, గోధుమ పిండి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావుతోపాటు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రేషన్ కార్డుదారులకు మూడు కిలోల రాగులు, కిలో గోధుమ పిండి పంపిణీకి పుంగనూరు నుండి శ్రీకారం చుట్టారు. అలాగే పుంగనూరు మున్సిపాలిటీకి చెత్త సేకరణ కోసం ఇటీవల ప్రభుత్వం అందించిన 15 ఈ ఆటోలను మంత్రులు ప్రారంభించారు.

Peddireddy Ramachandra Reddy : జగన్ తాగు, సాగు నీరు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే… కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్న చంద్రబాబు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఈ సందర్భంగా మంత్రి కారుమురి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆత్మీయులు ఉంటారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. రానున్న రోజుల్లో ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇన్ని లక్షల రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిస్తే చంద్రబాబు గుండె ఆగిపోతుందన్నారు. రాగులు, జొన్నలు కూడా పంపిణీ చేసే ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

రాగులు, జొన్నలు పండించే వారికి సబ్సిడీలు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలనే ముందు చూపుతో సీఎం వైఎస్ జగన్ ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారని కొనియాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలు మర్చిపోకుండా చెబితే 2 లక్షల రూపాయల ప్రైజ్ అందిస్తామని తెలిపారు. తిరుమలలో గొల్లమండపం తొలగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తే సీఎం వైఎస్ జగన్ అడ్డుకున్నారని గుర్తు చేశారు.

CPI Narayana : మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కామన్ సివిల్ కోడ్ తెరపైకి : నారాయణ

యాదవ్ లు మాట ఇస్తే తప్పరని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ యాదవ్ వర్గానికి ఎంతో మేలు చేశారని కొనియాడారు. పౌరసరఫరాల శాఖను నాశనం చేసింది చంద్రబాబు అయితే.. మధ్యవర్తులను తప్పించి రైతులకు మేలు చేసింది సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు