CM Jagan : మార్పు టెన్షన్.. సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు

అధికార వైసీపీలో మార్పులు చేర్పులు గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 సీట్లు ఉండగా.. 6 చోట్ల ప్రస్తుతానికి సిట్టింగ్ లను మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

Tension In YSRCP MLAs

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వారిలో మంత్రి వేణుతో పాటు ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు జ్యోతుల చంటి బాబు, పెండెం దొరబాబు, పర్వత ప్రసాద్, ఎలీజా, బాలరాజు ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.

అధికార వైసీపీలో మార్పులు చేర్పులు గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 సీట్లు ఉండగా.. 6 చోట్ల ప్రస్తుతానికి సిట్టింగ్ లను మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, మంత్రి వేణుగోపాల కృష్ణ సోమవారం సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ని కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?

ఉమ్మడి జిల్లాల పరిధిలోని తూర్పులో మూడు చోట్ల, పశ్చిమలోని 3 చోట్ల మార్పులు ఉంటాయన్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఇక ఈ లిస్టులో ఇంకొందరు ఉన్నారు అనే ప్రచారం మిగిలుంది. దాంతో ఆ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి గట్టి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ఫ్యాన్ పార్టీ హవా చూపింది. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉండటంతో మరోసారి ఈ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైసీపీ హైకమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే వైసీపీకి 13మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముగ్గురు మంత్రులు, ఒక చీఫ్ విప్ ఉన్నారు. మంత్రుల్లో ఒకరిని పార్లమెంటుకు మార్చాలని అధిష్టానం ప్రతిపాదిస్తుండగా మరొకరు సేఫ్ జోన్ కోసం మరొక స్థానానికి మారాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఇక మరో మంత్రిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటంతో మార్చేయక తప్పని పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతోంది.

Also Read : మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. వైసీపీలో చేరిన పలువురు జనసేన నేతలు

ప్రస్తుతానికి పోలవరం, పి గన్నవరం, చింతలపూడి ఎమ్మెల్యేలను మార్చేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు సీఎం జగన్ తో సమావేశం కావడానికి తాడేపల్లికి చేరుకున్నారు.