Chegondi Harirama Jogaiah
Chegondi Harirama Jogaiah : మరికొన్ని రోజుల్లో తెలంగాణలో జరుగనున్న ఎన్నికలు కాక పుట్టిస్తుంటే..అటు ఏపీలో ఎన్నికలకు సంబంధించి ప్రకటన రాకుండానే రాజకీయ వాతావరణం రోజు రోజుకు హీటెక్కుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. తమ కూటమిలోకి బీజేపీ వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కూటమిగా వెళుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో కూడా టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా..? లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు.
ఈక్రమంలో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉంది అంటూ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతు.. వైసీపీ రాక్షస పాలన అంతమొందించాలంటే కూటమి జనరంజకమైన ఉమ్మడి మేనిఫెస్టో ఎంతో అవసరమని అన్నారు. వైసీపీకి సంక్షేమ పథకాలను జనసేన కూటమి సంక్షేమ పథకాలతోనే తిప్పి కొట్టాలని అన్నారు.
TDP-Janasena : టీడీపీ – జనసేన జేఏసీ భేటీ.. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు: అచ్చెన్నాయుడు
అన్ని వర్గాలకు చెందిన పేదలతో చర్చించి మేనిఫెస్టో ఖరారు చేసామని…20 మందితో కమిటీని వేసి వారందరి అభిప్రాయాలతో తయారు చేసిన పీపుల్స్ మేనిఫెస్టో ముసాయిదాను నాదేండ్ల మనోహర్ కు అందజేశామని వెల్లడించారు.తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే సంక్షేమం పథకాలు ఆందాలని ప్రతిపాదన చేశామన్నారు.కుటుంబ పోషణ నిమిత్తం ప్రతీ పేద కుటుంబానికి నెల నెలా రూ. 5 వేలు సహాయం ఇవ్వాలని సూచించామని..ప్రతీ ఆడపిల్లకు పెళ్ళి కానుకగా రూ. 3 లక్షలు అందివ్వాలని సూచిచామన్నారు.