Chegondi Surya Prakash: జనసేన పార్టీకి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ పెద్ద షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంతకుముందు జనసేన పీఏసీ మెంబర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆచంట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌గా కూడా ఆయన కొనసాగుతున్నారు. అయితే ఆచంట టికెట్ టీడీపీకి కేటాయించడంతో నిడదవోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ టికెట్ ఆశించారు. ఇక్కడ కూడా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో అధికార వైసీపీ వైపు మొగ్గుచూపారు.
శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాతో సూర్యప్రకాశ్ ను సీఎం జగన్ స్వాగతించారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌గా సూర్యప్రకాశ్‌ను నియమించే అవకాశం ఉందని తాజా సమాచారం.
Also Read: వివేకా కూతురు సునీత ఇవాళ ముసుగు తీసేశారు.. అసలు విషయం తేలింది: సజ్జల