Chicken: భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కారణం ఇదే!

Chicken Rates: ఏపీలో చికెన్‌ ధర ఒక్కసారిగా పడిపోయింది. రాష్ట్రంలో కిలో చికెన్ ధర రూ.70 నుండి 80వరకు తగ్గింది. బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.220 అమ్మగా, ప్రస్తుతం రూ.140-150కే అమ్ముతున్నారు. గత వారం కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్‌ ధర ఇప్పుడు రూ.80 మాత్రమే పలుకుతోంది. వేసవి కారణంగా 30శాతం వరకు వినియోగం తగ్గడంతో చికెన్‌ ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

అయితే, నిరుడు ఇదే సమయంలో కిలో చికెన్‌ రూ.250పైగా పలకగా… అప్పుడు కరోనా బారిన పడకుండా, ఇమ్యూనిటీ కోసం లాక్‌డౌన్‌ సడలింపు సమయాల్లో చికెన్‌, మటన్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడు.. ఆదివారాలు తప్ప, మిగిలిన రోజుల్లో చికెన్‌ దుకాణాల దగ్గర పెద్దగా సందడి లేదు. చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గాయి. హోల్‌సేల్‌గా వంద గుడ్లకు 50నుంచి 65రూపాయల వరకు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

రిటైల్‌గా ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు 5రూపాయలకు అమ్ముతుండగా.. వేసవి ఎండలకు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు అనారోగ్యం పాలవుతున్నాయి. వాటిని దుకాణాలకు తరలిస్తున్నారు. మరోవైపు కరోనా ప్రభావంతో కూలీలు కూడా రాకపోవడంతో పౌల్ట్రీలు మూతపడుతున్న కారణంగానే చికెన్‌ ధరలు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు