CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల దెబ్బకు కడప, నెల్లూరు, చిత్తూరు అల్లాడిపోయింది.

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల దెబ్బకు కడప, నెల్లూరు, చిత్తూరు అల్లాడిపోయింది. వరద ప్రభావంతో అతలాకుతలమైన మూడు జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈమేరకు జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్‌లో 2,3 తేదీల్లో తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు.

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయలదేరి గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకుని, అక్కడ నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట మండలం మదనపల్లిలో పులపాతూరు గ్రామంలో తిరగనున్నారు ముఖ్యమంత్రి.

Sirivennela : సిరివెన్నెలకి.. ఆ జిల్లాకి.. విడదీయలేని బంధం

భారీగా దెబ్బ తిన్న గ్రామాన్ని సందర్శించి, బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం మందపల్లి గ్రామానికి వెళ్లి వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాంని సీఎం స్వయంగా పరిశీలిస్తారు. కడప జిల్లాలో పర్యటన తర్వాత నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు ముఖ్యమంత్రి.

ట్రెండింగ్ వార్తలు