Sirivennela : సిరివెన్నెలకి.. ఆ జిల్లాకి.. విడదీయలేని బంధం

సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం విజయనగర సాహిత్యాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన విజయనగరంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తున్నారు. విజయనగరం గురజాడ.....

Sirivennela :  సిరివెన్నెలకి.. ఆ జిల్లాకి.. విడదీయలేని బంధం

Vijayanagaram

Sirivennela :  తెలుగు అక్షరాలతో పద విన్యాసం చేసి పాటల్ని రచించిన గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ప్రీతీ. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా ఎంతో మంది సాహితివేత్తలకు, సాంస్కృతిక కళాకారులకు పుట్టినిల్లు. సిరివెన్నెల కూడా ఆ దగ్గర్లోనే అనకాపల్లిలో జన్మించడంతో విజయనగరం జిల్లాతో విడదీయలేని సాహితీ అనుబంధం ఏర్పడింది. సిరివెన్నెలకు విద్యలనగరమైన విజయనగరమంటే ఎంతో ఇష్టం ఇది ఎన్నో సార్లు ఆయనే స్వయంగా చెప్పారు.

Sirivennela : పాటల రచయితల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి : చంద్రబోస్

2018లో మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని ఆనందగజపతి ఆడిటోరియంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆ సమయంలో విజయనగరం జిల్లాతో తనకున్న అవినాభావ సంబంధాన్ని తెలియచేశారు.

Sirivennela : ఫిలిం ఛాంబర్‌లో సిరివెన్నెల భౌతిక కాయం.. సినీ ప్రముఖులు, అభిమానుల నివాళి

సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం విజయనగర సాహిత్యాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన విజయనగరంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తున్నారు. విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ మాట్లాడుతూ.. ఓ సాహితీ సౌరభం నేలరాలింది. ఆయన రచనలు అజరామరం. ఏ నోట విన్నా ఆయన రాసిన పాటలే. మంచి మనిషిగా, పాటల మాంత్రికునిగా పేరు తెచ్చుకొని ఎన్నో అవార్డులు పొందిన వెన్నెల అస్తమయం అయిందన్న విషయం చాలా బాధాకరం. ఆయన కుమార్తె వివాహానికి విజయనగరంలో ఎంతో మందిని స్వయంగా ఆయనే పిలిచారు. మేమంతా ఆ వివాహానికి కూడా వెళ్ళాము అని అన్నారు. గురజాడ సమాఖ్య తరఫున ఆయనకు అంజలి ఘటిస్తున్నామని తెలిపారు.