Varanasi : వారణాసి మూవీలో ప్రభాస్ స్పెషల్ ఎంట్రీ.!?

వారణాసి మూవీలో (Varanasi ) ప్రభాస్‌ స్పెషల్ గెటప్‌లో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.

Varanasi : వారణాసి మూవీలో ప్రభాస్ స్పెషల్ ఎంట్రీ.!?

Gossip Garage Prabhas special role in Mahesh Babu Varanasi movie

Updated On : January 8, 2026 / 3:57 PM IST

Varanasi : గ్లోబల్ ఆడియెన్స్‌లోనూ ఎక్స్‌పెక్టేషన్స్, ఎగ్జైట్‌మెంట్‌ను పెంచేస్తున్న మూవీ వారణాసి. దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త లీకులు, గాసిప్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

యాక్షన్ అడ్వెంచర్, సోషియో-ఫాంటసీగా రామాయణం ఎపిసోడ్ ఇన్‌స్పైర్డ్ స్టోరీగా వారణాసి రూపుదిద్దుకుంటోంది. ఏప్రిల్ 2027లో ఈ మూవీని రిలీజ్ చేస్తారని టాక్. రూ.1300 కోట్ల బడ్జెట్‌తో ఇంటర్నేషనల్ లెవల్‌లో పిక్చర్‌ తీస్తున్నారని అంటున్నారు. అయితే వారణాసి మూవీపై మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక హాట్ రూమర్ రన్ అవుతోంది. వారణాసి మూవీలో ప్రభాస్‌ స్పెషల్ గెటప్‌లో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.

Prabhas : స్పిరిట్ కోసం ప్రామిస్ చేసిన ప్రభాస్.. ఇన్నేళ్లు చేయంది ఫస్ట్ టైం చేయబోతున్నాడు.. ప్రభాస్ కామెంట్స్ వైరల్..

 

రాజమౌళి ప్రభాస్‌తో మహాభారతం ప్లాన్ చేస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దానికి లింక్ చేసి వారణాసిలో కృష్ణుడు లేదా ఏదో ఒక మైథాలజికల్ రోల్‌ చేయబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ లాంగ్ హెయిర్, బియర్డ్, ట్రెడీషనల్ వారియర్ గెటప్‌లో వారణాసిలో స్పెషల్ రోల్ చేస్తారని టాక్.

ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ బిజీలో ఉన్నాడు. ఆ మూవీ ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయింది. సంక్రాంతి బరిలో నిలుస్తుంది. ఇక సందీప్‌రెడ్డి వంగాతో ప్రభాస్‌ చేస్తున్న స్పిరిట్ మూవీ ఫస్ట్ లుక్ డ్రాప్ అయింది. ప్రభాస్ కల్కి మూవీలో డైరెక్టర్ రాజమౌళి ఆలా మెరిసి అలరించాడు. ఇప్పుడు వారణాసిలో మాత్రం ప్రభాస్‌ది కీరోల్ అంటున్నారు. ఈ మధ్య కన్నప్పలో ప్రభాస్ స్పెషల్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. ఇలాంటి ఈక్వేషన్స్‌ నడుమ వారణాసిలో ప్రభాస్ రోల్‌పై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేస్తున్నాయి. గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ డార్లింగ్ క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్నాడట జక్కన్న.