Prabhas : స్పిరిట్ కోసం ప్రామిస్ చేసిన ప్రభాస్.. ఇన్నేళ్లు చేయంది ఫస్ట్ టైం చేయబోతున్నాడు.. ప్రభాస్ కామెంట్స్ వైరల్..

ఈ ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి, ప్రభాస్ గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.(Prabhas)

Prabhas : స్పిరిట్ కోసం ప్రామిస్ చేసిన ప్రభాస్.. ఇన్నేళ్లు చేయంది ఫస్ట్ టైం చేయబోతున్నాడు.. ప్రభాస్ కామెంట్స్ వైరల్..

Prabhas

Updated On : January 8, 2026 / 2:29 PM IST

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి, ప్రభాస్ గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.(Prabhas)

అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా మీరు, ఆ అనుభవం మీకు లేదు కదా, అసలు మీ సినిమాలు మీరు చూస్తారా అని సందీప్ రెడ్డి వంగ అడిగాడు.

Also Read : Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ వచ్చేసింది.. పండగ లాంటి సినిమా.. నాగార్జున వాయిస్ ఓవర్ తో అదిరిందిగా

దానికి ప్రభాస్ మాట్లాడుతూ.. నా సినిమాలు నేను రిలీజ్ రోజు చూడను. ఒక వారం రోజుల తర్వాత చూస్తాను. ఫస్ట్ డే ఫస్ట్ షో యుఫొరియా మిస్ అవుతాను అని చెప్తారు. స్పిరిట్ కి వెళదాం. నువ్వు ఆల్రెడీ అడిగావు నేను ప్రామిస్ చేశాను వస్తాను. నాకు సినిమా రిలీజ్ మొదటి రోజు చాలా స్ట్రెస్ ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉన్నా పర్ఫార్మెన్స్ కోసం మాత్రం కొన్ని డేస్ తర్వాత చూస్తాను.

ఇలాగే థియేటరికల్ అనుభవం అని చెప్పి KGF 2 సినిమాకు మా కజిన్స్, ఫ్రెండ్స్ తో ప్రసాద్ ల్యాబ్ లో సినిమా చూసాను. వాళ్లంతా నన్ను తీసుకెళ్లారు. అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ సినిమాని. ఆ అనుభవం మర్చిపోను. కల్కి సినిమాకు కూడా అలాగే వెళ్ళాము. అయితే సెకండ్ హాఫ్ లో నాకు, అమితాబ్ సర్ మధ్య జరిగే ఫైట్ లో నా కోసం అరవట్లేదు. అమితాబ్ సర్ కోసం అరుస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. వాళ్లంతా నా కజిన్స్, ఫ్రెండ్స్ అయినా నా కోసం అరవట్లేదు. సినిమాలో నాది సెల్ఫిష్ పాత్ర, అమితాబ్ గారిది హీరోయిక్ పాత్ర కాబట్టి సినిమాకు కనెక్ట్ అయ్యారని అప్పుడు అర్థమైంది అని తెలిపాడు.

Also Read : Sobhita Dhulipala : నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ మొదటి సినిమా.. ‘చీకటిలో’ రిలీజ్ ఎప్పుడంటే..

దీంతో రాజాసాబ్ కూడా ప్రభాస్ ఫస్ట్ డే చూడడు అనే తెలుస్తుంది. స్పిరిట్ సినిమా ప్రభాస్ మొదటి రోజు ఏ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య కూర్చొని చూస్తాడో చూడాలి.