Zodiac Signs: 2026లో కచ్చితంగా గృహ యోగం, వాహన యోగం ఉన్న 6 రాశుల వాళ్లు వీరే..!
దేవ గురువైన బృహస్పతి గృహ కారకుడు, వాహన కారకుడు. బృహస్పతి స్వకేత్రంలో ఉన్నా, ఏదైనా రాశిలో ఉచ్చలో ఉన్నా శుభ కార్యక్రమాలు బాగా నిర్వహించకోవచ్చు.
Own House Representative Image (Image Credit To Original Source)
- 2026లో గృహ యోగం ఉన్న రాశులు ఇవే..
- గృహ యోగంతో పాటు వాహన యోగం కూడా ఉంది
- శుభ కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు
Zodiac Signs: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. తమ కొంటూ సొంతంగా ఓ ఇల్లు ఉండాలని అంతా కోరుకుంటారు. చిన్నదో పెద్దదో పక్కన పెడితే ఓన్ హౌస్ అనేది ప్రతీ వ్యక్తి డ్రీమ్. దాని కోసం చాలా కష్టపడతారు. సొంతింటి కలను నేరవేర్చుకోవడానికి పైసా పైసా కూడబెడతారు. చివరికి స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2026లో 6 రాశుల వారికి గృహ యోగం ఉంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.
దేవ గురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చలో ఉండటం వల్ల, అలాగే దేవ గురువైనటువంటి బృహస్పతి గృహ, వాహన కారకుడు అవటం వల్ల 12 రాశులలో 6 రాశుల వాళ్లు ఇంట్లో శుభ కార్యక్రమాలు బాగా నిర్వహించగలుగుతారు. ఆ ఆరు రాశుల వారికి కచ్చితంగా గృహ యోగం, వాహన యోగం కలగబోతోంది అని పండితులు చెబుతున్నారు.
దేవ గురువైన బృహస్పతి గృహ కారకుడు, వాహన కారకుడు. బృహస్పతి స్వకేత్రంలో ఉన్నా, ఏదైనా రాశిలో ఉచ్చలో ఉన్నా శుభ కార్యక్రమాలు బాగా నిర్వహించకోవచ్చు. ఈ ఏడాది కర్కాటకంలో ఉచ్చలో దేవ గురువు బృహస్పతి ఉంటాడు కాబట్టి ఆయనే గృహ, వాహన లాభాలను కలిగిస్తాడు. గురు బలం వల్ల 6 రాశుల వాళ్లు గృహ యోగాన్ని, వాహన యోగాన్ని పొందబోతున్నారు. ఇళ్లలో శుభ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
గృహ యోగం ఉన్న ఆరు రాశులలో మొదటిది మేష రాశి. ఈ రాశి వారికి చతుర్ధ స్థానంలో గురువు జూన్ 2వ తేదీ ఉచ్చలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి జూన్, జూలై నెలల్లో మేష రాశి వాళ్లు గృహ ప్రవేశం చేసే అవకాశాలు ఎక్కువ. సొంతింటి కల సాకారం చేసుకునే యోగం మేష రాశి వారికి ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, ఆర్థిక వనరులు అందుతాయి, డబ్బు అందుబాటు అవుతుంది. అలాగే ఈ రాశి వారికి జూన్ జూలై నెలల్లో సొంత వాహనం (బండి లేదా కారు) కొనుక్కునే యోగం కూడా బాగా ఉంది.
ఫిబ్రవరి తర్వాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశాలెక్కువ..
భూ లాభం, గృహ లాభం, వాహన లాభం, శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం.. ఇవన్నీ రాబోతున్న రెండో రాశి మిధున రాశి. ఈ రాశి వారికి ధన స్థానంలో గురువు ఉచ్చలో ఉండబోతున్నాడు. కాబట్టి ఫిబ్రవరి నెలలో గృహ, వాహన యోగాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల తర్వాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులన్నీ అందుతాయి. మే నెల తర్వాత మిధున రాశి వారు గృహ ప్రవేశం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
2026లో గృహ లాభము, వాహన యోగము, శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగము.. ఇవన్నీ ఉన్నటువంటి మూడో రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గృహ, వాహన కారకుడైన గురువు జూన్ 2వ తేదీకి కర్కాటకంలో ఉచ్చలో ఉంటున్నాడు. దీని వల్ల ఈ రాశి వారికి మే నెల లోపు గృహ యోగం పడుతుంది. జూలై నెలలో గృహ ప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి తర్వాత వాహన యోగం కూడా ఉంది.
ఇక 2026లో గృహ యోగము, వాహన యోగము, శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం ఉన్నటు వంటి తదుపరి రాశి కన్య రాశి. వీరికి లాభ స్థానంలో గురువు ఉచ్చలో ఉంటాడు. దాని వల్ల తప్పకుండా మే నెలలో గృహ ప్రవేశం చేసే యోగం ఉంది. ఆధునిక సౌకర్యాలు ఉన్న ఇంటిని కొనుగోలు చేసే యోగం వీరికి ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
ఫిబ్రవరి, మే నెలల మధ్యలో కచ్చితంగా గృహ ప్రవేశం..
ద్వాదశ రాశుల్లో గృహ, వాహన యోగంతో పాటు శుభకార్యాలు నిర్వహించే యోగం ఉన్న రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారు కూడా 2026లో సొంతింటి కలను నేరవేర్చుకుంటారు. ఈ రాశి వాళ్లకి భాగ్య స్థానంలో గురువు ఉచ్చలో ఉండటం వల్ల గృహ, వాహన సంబంధమైన కోరికలు తప్పకుండా నెరవేరతాయి. వాహన యోగం కూడా ఉంది. ఫిబ్రవరి, మే నెలల మధ్యలో కచ్చితంగా గృహ ప్రవేశం చేస్తారు. స్థలం అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతో సొంతింటిని కొనుక్కునే యోగం కూడా ఉంది. భాగ్య స్థానంలో గురువు ఉచ్చలో ఉండటం వల్ల జూన్ నుంచి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి.
2026లో కచ్చితంగా గృహ, వాహన యోగం కలిగి శుభ కార్యక్రమాలు నిర్వహించే ఆఖరి రాశి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉచ్చ పట్టడంతో పాటుగా రాశ్యాధిపతి అయిన శని తృతీయంలో అనుకూలంగా ఉండటం వల్ల కొద్ది ప్రయత్నంతోనే సొంతింటి కల నెరవేర్చుకుంటారు. ఈ రాశి వారు పెద్దగా కష్టపడకుండానే సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. మే నెలలో గృహ ప్రవేశం చేసే యోగం ఉంది.
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
Also Read : 2026లో 100శాతం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే 6 రాశుల వాళ్లు వీరే..!
