Zodiac Signs: 2026లో 100శాతం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే 6 రాశుల వాళ్లు వీరే..!
నూతన సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ కొట్టబోయే 6 రాశుల్లో మొట్టమొదటి రాశి ఈ మేష రాశి. Zodiac Signs
Zodiac Signs Jobs Representative Image (Image Credit To Original Source)
Zodiac Signs: 2026 సంవత్సరంలో కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే 6 రాశులు ఏంటో తెలుసుకుందాం. 12 రాశుల్లో 6 రాశుల వారికి 100శాతం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా గవర్నమెంట్ జాబ్స్ కి రవి గ్రహం బలం, శని గ్రహం బలం, గురు గ్రహం బలము కావాలి. రవి, శని, గురు గ్రహం అనుకూలించడం వల్ల గురువు ఉన్నత ఉద్యోగాలకు కారకుడు, శని ఉన్నత ఉద్యోగాలు తొందరగా వచ్చేలా చేస్తాడు కాబట్టి, రవి గ్రహం గవర్నమెంట్ జాబ్ తొందరగా వచ్చేలా చేస్తుంది కాబట్టి.. 12 రాశులలో 6 రాశుల వారికి కొత్త ఏడాదిలో సర్కారీ కొలువు వచ్చే ఛాన్స్ 100కి 100శాతం ఉందని పండితులు చెబుతున్నారు.
నూతన సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ కొట్టబోయే 6 రాశుల్లో మొట్టమొదటిది మేష రాశి. ఈ కొత్త ఏడాదిలో మేష రాశి వాళ్లకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి జూన్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే పదోన్నతి పొందేందుకు అవకాశాలు ఉన్నాయి.
జూన్ 2 తర్వాత తిరుగు లేదు..
జూన్ నెలలో గురువు ఉచ్చలోకి వెళ్తాడు కాబట్టి కర్కాటకంలో మేషరాశి వాళ్లు జూన్ 2 తర్వాత ప్రభుత్వ పరీక్షలు రాస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు అని పండితులు చెబుతున్నారు. గవర్నమెంట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూల్లో కూడా బ్రహ్మాండమైన విజయం సాధించే యోగం జూన్ 2 తర్వాత మేష రాశి వారికి ఎక్కువగా ఉంది. కీలక ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
2026లో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న రాశి వాళ్లు మిధున రాశి. దశమ స్థానంలో శని సంచారం వల్ల కంటక శని దోషం ఉన్నప్పటికీ కేంద్ర స్థానంలో పాప గ్రహం కొన్ని సార్లు శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి మిధున రాశి వాళ్లకి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. జూన్ తర్వాత ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ సంవత్సరం కచ్చితంగా సర్కారీ కొలువు వచ్చే మూడో రాశి కర్కాటక రాశి. గురు, శని, రవి బలం పెరుగుతోంది. దీంతో జూన్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం కర్కాటక రాశి వాళ్లు ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి ప్రాధాన్యత, ప్రాబల్యం ఉన్న జాబ్ లభించే అవకాశాలు ఎక్కువ.
ఈ సంవత్సరం కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే నాలుగో రాశి తుల రాశి. ఈ రాశి వాళ్లకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త సంవత్సరం ద్వితీయార్ధంలో తుల రాశి వాళ్లు ప్రభుత్వంలో అత్యంత ప్రాబల్యం కలిగినటువంటి ఉద్యోగం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విదేశాలతో సంబంధం ఉన్న శాఖల్లో ఉద్యోగం వచ్చే అవకాశం..
ఈ సంవత్సరం కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే 5వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగ స్థాన అధిపతి రవి బలంగా ఉన్నాడు. అలాగే శని పంచమ స్థానంలో, గురువు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి తప్పకుండా సర్కారీ కొలువు వచ్చే అవకాశం ఉంది. జూన్ తర్వాత ఈ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంది. సాధ్యమైనంత వరకు జూన్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం గట్టిగా ట్రై చేస్తే వచ్చే అవకాశం ఉంది. విదేశాలతో సంబంధం ఉన్న వింగ్స్ లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సంవత్సరం కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం 6వ రాశి మకర రాశి. ఈ రాశి వాళ్లకు సప్తమ స్థానమైన కర్కాటక రాశిలో గురువు ఉండటం వల్ల దాంతో పాటు కొత్త ఏడాదిలో ద్వితీయార్ధంలో గ్రహాల బలం ఎక్కువగా ఉండటం వల్ల మకర రాశి వారికి కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. జూన్ 2 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉచ్చలో ఉంటున్నాడు కాబట్టి 100శాతం జూన్ 2 తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం కోసం మకర రాశి వాళ్లు ప్రయత్నించండి. ఎటువంటి గర్నమెంట్ జాబ్ అయినా వచ్చే అవకాశం ఉంది.
Also Read: మీ ఇంట్లో ఎప్పుడూ ధనం ఉండాలా, వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలా.. ఇలా చేసి చూడండి..!
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
