ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారా?
వాళ్లు అప్పుడప్పుడు సొంత పార్టీపై, సీఎం రేవంత్‌పై అసంతృప్తి గళం వినిపిస్తున్నారట.
BJP, Congress (Image Credit To Original Source)
- దక్షిణ తెలంగాణకు ఆ ఎమ్మెల్యేలకు గాలం
- నల్లగొండ, పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలతో రాయబారం!
- ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో ఇద్దరు బీజేపీ ఎంపీల మంత్రాంగం!?
BJP: తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పరంగా బీజేపీ బలం ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ మినహా..మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ..ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ జంట నగరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. ఉత్తర తెలంగాణలో అంతో ఇంతో బలంగా ఉన్న బీజేపీ దక్షిణ తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిందట.
రాబోయే ఎన్నికల వరకు మరింత బలపడి అధికారంలోకి రావాలని కలలు కంటున్న కమలనాథులు..దక్షిణ తెలంగాణలో పేరున్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టిందట బీజేపీ. ఆ ఇద్దరు కూడా గతంలో బీజేపీలో పనిచేసిన ఎమ్మెల్యేలే అంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయ్.
ఉత్తర తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్‌గా ఉంది. నార్త్ తెలంగాణలో మూడు ఎంపీ సీట్లు, ఏడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న కమలనాథులు..గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ ఉత్తర తెలంగాణలో గతం కంటే ఎక్కువ స్థానాలే గెలుచుకున్నారు.
Also Read: కొండా సురేఖ, పొంగులేటి మధ్య గ్యాప్ సెట్ కాలేదా? ఆ టెండర్లపై ముసలం కంటిన్యూ?
దక్షిణ తెలంగాణలో ఒకరిద్దరు మినహా.. బీజేపీకి పెద్దగా పట్టున్న లీడర్లు లేరన్న అభిప్రాయం ఉంది. పైగా క్యాడర్ కూడా స్ట్రాంగ్ లేదని భావిస్తున్నారట. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణలో కాస్త పేరున్న, ప్రజాబలం ఉన్న లీడర్లను..చేర్చుకుంటే..రాబోయే ఎన్నికల్లో సత్తా చాటొచ్చని ప్లాన్ చేస్తున్నారట. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే..దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో కూడా బలపడాలని లెక్కలు వేసుకుంటున్నారట కాషాయ నేతలు.
బీజేపీ స్టేట్ లీడర్లతో టచ్‌లో..
ఈ క్రమంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారట బీజేపీ లీడర్లు. దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు..బీజేపీ స్టేట్ లీడర్లతో టచ్‌లో ఉంటున్నారట. నల్లగొండకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పాలమూరుకు చెందిన మరో హస్తం పార్టీ ఎమ్మెల్యే..కొన్ని రోజులుగా వాళ్ల సొంత పార్టీ పెద్దలపై అసంతృప్తిగా ఉన్నారట. అడిగిన పనులు చేసి పెట్టడం లేదని..కోరుకున్న పదవులు ఇవ్వట్లేదని నిరుత్సాహంగా ఉన్నారట.
ఈ క్రమంలోనే వాళ్లు అప్పుడప్పుడు సొంత పార్టీపై, సీఎం రేవంత్‌పై అసంతృప్తి గళం వినిపిస్తున్నారట. అలా కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్‌గా లేని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపైన కన్నేసిన కమలనాథులు తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారట.
కమలం గూటికి చేర్చే ప్రయత్నాలు
హైదరాబాద్ జంట నగరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ బీజేపీ ఎంపీ.. దక్షిణ తెలంగాణకు చెందిన మరో బీజేపీ మహిళా నాయకురాలు.. ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టచ్‌లోకి వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
హస్తం పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో.. తమకు ఉన్న సాన్నిహిత్యం, పరిచయాలతో కమలం గూటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారట. అయితే బీజేపీలోకి ఎవరైనా వస్తే పార్టీ సంప్రదాయం ప్రకారం వారు పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు కొందరు బీజేపీ లీడర్లు.
దీంతో సరైన సమయంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సరైన నిర్ణయం తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నది నిజమే అయితే..వాళ్లు కమలం గూటికి రావాలనుకుంటే మాత్రం..రాష్ట్రంలో పొలిటికల్ సినారియో మారిపోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
