Allu Arjun: కింగ్డమ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్.. షూట్ కూడా స్టార్ట్ అయ్యింది
కింగ్డమ్ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).
Allu Arjun shared photos with director Gautham Tinnanuri.
- ‘అల్లు సినిమా’ మల్టీప్లెక్స్ ప్రమోషన్స్ షురూ
- టాడ్ షూట్స్ పాల్గొన్న అల్లు అర్జున్
- గౌతమ్ తున్ననూరితో ఫోటోలను షేర్ చేసిన అల్లు అర్జున్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఏం చేసినా క్షణంలో వైరల్ అవుతోంది. ఆ రేంజ్ లో ఆయన స్టార్డం పెరిగిపోయింది. అయితే, ఓపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోపక్క వ్యాపారాల్లో కూడా అడుగుపెడుతున్నాడు. ఇటీవల ఆయన ‘అల్లు సినిమాస్’ పేరుతో ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మల్టీప్లెక్స్ ను ఫార్మల్ గా ఓపెన్ చేశారు. ఆ న్యూస్ కూడా ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది.
ఇక ఈ మల్టీప్లెక్స్ ప్లెక్స్ లో తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్ ల ఫొటోలతో పాటు మామయ్య చిరంజీవి ఫోటోను కూడా ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు బన్నీ. ఇక సంక్రాంతి సినిమాలతో అల్లు సినిమాస్ లాంఛనంగా మొదలుకానుంది. అయితే, ఈ మల్టీప్లెక్స్ ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేయనున్నాడు అల్లు అర్జున్(Allu Arjun). ఇందుకోసం తానే స్వయంగా రంగంలోకి దిగనున్నాడు.
Pooja Hegde: ట్రెడిషనల్ వియర్ లో ట్రెండీ లుక్స్.. జననాయగన్ బ్యూటీ పూజ హెగ్డే గ్లామర్ ఫీస్ట్..
తాజాగా, ఈ మల్టీప్లెక్స్ ప్రమోషన్స్ అండ్ యాడ్ షూట్స్ కూడా మొదలయ్యాయి. ఈ యాడ్స్ కి కింగ్డమ్ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు. దీనికి సంబందించిన ఫోటోలు అల్లు అర్జున్ స్వయంగా షేర్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు.
హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్నారు మేకర్స్. దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పుష్ప 2లాంటి ఇండస్ట్రీ తరువాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
