Chintamaneni : చింతమనేని ఎక్కడ ? చెప్పాలంటూ ఫ్యామిలీ ఆందోళన

టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్టును నిరసిస్తూ ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. చింతమనేని ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Chintamaneni Arrest : టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్టును నిరసిస్తూ ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. చింతమనేని ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. చింతమనేని ప్రభాకర్ ఎక్కడున్నారో చెప్పాలంటూ జాతీయ రహదారిని దిగ్బంధించడానికి రెడీ అవుతున్నారు.

Read More : Platelets : ప్లేట్ లెట్స్ ఏస్ధాయికి చేరితే ప్రమాదం… ఎప్పుడు ఎక్కించాలంటే?..

ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో గల చింతమనేని ఇంటివద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడున్న వారినందరినీ పంపించేస్తున్నారు. ఎవరినీ అటువైపు రానివ్వడంలేదు. దీంతో పోలీసులతో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగుతున్నారు. చింతమనేనిని 2021, ఆగస్టు 29వ తేదీ ఆదివారం నర్సీపట్నంలో అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్లేదు. అయితే… ఆయనను విశాఖ జిల్లా చింతలపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉంచారంటూ ప్రచారం సాగుతోంది. కానీ ఆ ప్రచారాన్ని ఖండించారు విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ. చింతమనేని తమ కస్టడీలో లేరని చెప్పారు. దీంతో అటు కుటుంబసభ్యులు, ఇటు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నారు.

Read More : R. Narayana Murthy : ఓ అమ్మాయిని ప్రేమించిన నారాయణ మూర్తి.. కానీ చివరకు!

అరెస్టు ఎందుకు చేశారంటే :-
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ ఎడ్ల బండిపై దెందులూరు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. అయితే, పోలీసుల తీరుపై చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చింతమనేనికి, పోలీసులకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. అనంతరం టీడీపీ, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి పెళ్లికి హాజరై వస్తుండగా అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు