Platelets : ప్లేట్ లెట్స్ ఏస్ధాయికి చేరితే ప్రమాదం… ఎప్పుడు ఎక్కించాలంటే?..

ఇక సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ విషయానికి వస్తే అధునికసాంకేతికతతో ఒక దాత నుండే ఎక్కవ పరిమాణంలో ప్లేట్ లెట్స్ ను సేకరిస్తారు. ఈ విధానం వల్ల రక్తం నుండి ఇతర అంశాలను పక్కన పెట్టి ఒక్క

Platelets : ప్లేట్ లెట్స్ ఏస్ధాయికి చేరితే ప్రమాదం… ఎప్పుడు ఎక్కించాలంటే?..

Platelets

Platelets : తెలుగు రాష్ట్రాల్లో డెంగీ మహమ్మారి అధికంగా ఉండటంతో ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ప్లేట్ లెట్ల పందం పదేపదే వినిపిస్తుంది. అనేక మంది డెంగీ బారిన పడి ప్లేట్ లెట్లు తగ్గటంతో ఆసుపత్రుల్లో చేరి అత్యవసర చికిత్స పొందుతున్నారు. ప్లేట్ లెట్లు తగ్గిపోవటం కారణంగా చివరకు చాలా మంది ప్రాణాపాయ స్ధితికి చేరుతున్నారు. ప్లేట్ లెట్ల సంఖ్య ఎంత ఉండాలి, ఎంతకు పడిపోతే ప్రమాదం…ప్లేట్ లెట్లు ఎవరికి అవసరం, ఎవరికి అవసరం ఉండదు అనే విషయాలు చాలా మందికి తెలియక అనేక అపోహలకు లోనవుతున్నారు.

ప్లేట్ లెట్స్ ఎముక మూలగ నుండి పుడతాయి. వీటి జీవితకాలం నాలుగ రోజులు. ఎముక మూలగలో ఏదైన సమస్య ఉత్పన్నమయ్యే సందర్భంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది. ఇది సాధారణంగా జరిగేదే. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిన సందర్భంలో రక్తం గడ్డగట్టే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. రక్తం గడ్డకట్టే జీవ క్రియల్లో ప్లేట్ లెట్స్ లోని ప్రొటీన్లతో కలసి పనిచేస్తాయి. వీటిని క్లాంటింగ్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. గాయం అయిన 2నుండి 3 నిమిషాల్లో ఈ వలయం కారణంగా రక్తం ప్రవహించకుండా ఆగిపోతుంది.

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శరీరంలో క్యూబిక్ మిల్లీ మీటర్ పరిమాణంలో 1.5 లక్షల నుండి 4.5లక్షల ప్లేట్ లెట్స్ ఉండాలి. ఇది సాధారణమైన పరిమాణం. 2నుండి 3 ఎంఎల్ రక్తాన్ని సేకరించి తద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను సెల్ కౌల్టర్ మెషిన్ ద్వారా నిర్ధారిస్తారు. డెంగీ వ్యాధి గ్రస్తుల్లో ప్లేట్ లెట్ల సంఖ్యను తెలుసుకునేందుకు ప్రతి 24 గంలకు ఒకసారి ఈ పరీక్ష నిర్వహిస్తారు. అప్లాస్టిక్ అనీమియా, కొన్ని రకాల రక్త క్యాన్సర్లు, లింఫోమా క్యాన్సర్లతోపాటు వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా మూలుగ దెబ్బతిని ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తెల్ల రక్తకణాల సంఖ్యకూడా తగ్గుతుంది.

డెంగీ బారిన పడిన రోగుల్లో ప్లేట్ లెట్స్ సంఖ్య అధికంగా తగ్గిపోతుంటుంది. ఇలాంటి సందర్భంలో శరీరంలో అంతర్గతంగా రోగికి రక్త స్రావం జరిగే ప్రమాదం సంభవించవచ్చు. ప్లేట్ లేట్స్ సంఖ్య బాగా తగ్గిపోయిన సందర్భంలో రోగి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా వెంటనే ప్లేట్ లెట్స్ ను ఎక్కించాల్సి ఉంటుంది. ప్లేట్ లెట్ ల సంఖ్య నాలుగు లక్షల నుండి 80,000వరకు పడిపోయినా ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్లేట్ లెట్ల సంఖ్య 20,000వేలకు పడిపోతే బాధితుడు ప్రమాదకర స్ధితిలోకి వెళతాడు. ఆసమయంలో శరీరానికి చిన్నపాటి గాయమైన రక్తం ఆగకుండా పోతూనే ఉంటుంది. ఆలాంటి సందర్భంలో ప్లేట్ లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది.

రక్తం చూసేందుకు ఎర్రని వర్ణంలో కనిపిస్తుంది. అయితే అందులో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్ లెట్స్, ప్లాస్మాతో పాటు, ప్రొటీన్లు ఉంటాయి. వాటిలో ప్లేట్ లెట్స్ చాలా క్రియాశీలకమైనవి. అనుకోని ప్రమాదం జరిగిన సందర్భంలో రక్తం పోకుండా 2 నుండి 3 నిమిషాల్లోనే ఆగిపోయేలా చేయటంలో ప్లేట్ లెట్స్ కీలకమైన పాత్ర వహిస్తాయి. ప్లేట్ లేట్స్ ను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు 1. ర్యాండమ్ డోనార్ ప్లేట్ లెట్స్(ఆర్.డి.పి) 2. సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ (ఎస్.డి.పి)

బ్లడ్ బ్యాంకుల్లో దాతల నుండి రక్తాన్ని సేకరించిన తరువాత దాని నుండి ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లెట్ లెట్స్ ను విడదీసి వేరుచేసి ప్యాక్ చేస్తారు. తద్వారా ఎవరికి ఎవి అవసరమో వాటిని ఎక్కిస్తారు. బ్లాడ్ బ్యాంకుల్లో దాతల నుండి బ్లడ్ ను సేకరిస్తారు. దాని నుండి ప్లేట్ లెట్స్ ను సమీకరిస్తారు. దీనిని ర్యాండమ్ డోనార్ ప్లేట్ లెట్స్ గా పిలుస్తారు. ఇలా ఎక్కించిన సందర్భంలో 5,000 కౌంట్ స్ధాయి మాత్రమే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కౌంట్ ను కనీసం 25,000 నుండి 30,000వరకు పెంచాలంటే ర్యాండమ్ డోనార్ ప్లేట్ లెట్స్ 5 నుండి 6 యూనిట్ల రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 6గురు రక్తం ఇచ్చే దాతలు అవసరం అవుతారు. ఒక్కో సందర్భంలో ప్లేట్ లెట్స్ ఎక్కువగా ఎక్కించాల్సిన సందర్భంలో రక్త సమీకరణకు దాతలు ఎక్కవ మంది అవసరం అవుతారు.

ఇక సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ విషయానికి వస్తే అధునికసాంకేతికతతో ఒక దాత నుండే ఎక్కవ పరిమాణంలో ప్లేట్ లెట్స్ ను సేకరిస్తారు. ఈ విధానం వల్ల రక్తం నుండి ఇతర అంశాలను పక్కన పెట్టి ఒక్క ప్లేట్ లెట్స్ మాత్రమే సేకరించేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఒక రోగికి 30వేల ప్లేట్ లెట్ కౌంట్ అవసరమనుకుంటే అంతే స్ధాయిలో దాత నుండి ప్లేట్ లెట్ లను సమీకరించుకోవచ్చు. ఒకసారి దాత ప్లేట్ లెట్లను డొనేట్ చేస్తే తిరిగి నాలుగురోజుల వ్యవధిలో భర్తీ అవుతాయి. అదే రక్తం దానం చేస్తే మాత్రం తిరిగి రక్తం భర్తీ కావటానికి మూడు నెలల సమయం తీసుకుంటుంది. ప్లేట్ లెట్లు ఇచ్చే విషయంలో చాలా మందిలో అనేక అపోహలు ఉంటాయి. అయితే అలాంటి అపోహలకు తావులేకుండా ప్లేట్ లెట్లను ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకురావచ్చు. దీనివల్ల ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు నిలిపిన వారవుతారు.