Nara Lokesh: నారా లోకేశ్‌ను సర్‌ప్రైజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఇంతలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజలతో పాటు క్యూలో నిలబడి సెల్ఫీ అడిగారు.

Nara Lokesh

Nara Lokesh – TDP: ప్రకాశం జిల్లా (Prakasam district) కనిగిరిలో నారా లోకేశ్ పర్యటిస్తున్న వేళ ఆయనను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సర్‌ప్రైజ్ చేశారు. సెల్ఫీ విత్ నారా లోకేశ్ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఆయనతో ప్రజలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంతలో చింతమనేని ప్రభాకర్ ప్రజలతో పాటు క్యూలో నిలబడి సెల్ఫీ అడిగారు.

Nara Lokesh

చింతమనేనిని చూసిన నారా లోకేశ్ అన్నా మీరు ఎప్పుడు వచ్చారు అంటూ ఆత్మీయంగా పలకరించారు. లోకేశ్ యాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చానని చింతమనేని చెప్పారు. దాదాపు 700 వందల మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతమనేని వచ్చారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.