Magunta Sreenivasulu Reddy
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీలో టికెట్ల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆఫీసుకి నేతలు, అభిమానులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ నేతల టికెట్ల విషయంలో వైసీపీ అధిష్ఠానం క్లారిటీ ఇవ్వలేకపోతున్న విషయం తెలిసిందే.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై ఇప్పటివరకు స్పష్టతరాలేదు. ఈ నేపథ్యంలోనే మాగుంటను పరామర్శించేందుకు పలు నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు వస్తున్నారు. ముఖ్య అనుచరులతో మాగుంట సమాలోచనలు జరుపుతున్నారు.
మాగుంటను చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మర్యాదపూర్వకంగా కలిశారు. మాగుంట, కరణం సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని స్థానిక వైసీపీ నాయకులు అంటున్నారు. టికెట్ దక్కకపోతే ఏం చేయాలనేదానిపై మాగుంట ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మాగుంటకు సీటు కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పట్టుబడుతుండడం గమనార్హం.
Harirama Jogaiah: ఎన్నికల వేళ ఈ విషయంపైనే పవన్ కల్యాణ్‌తో చర్చించాను: హరిరామజోగయ్య