Jagan
Chiru-Jagan Meet: తెలుగు చిత్రపరిశ్రమలో గతకొంతకాలంగా ఏపీలో టిక్కెట్ల విషయం వివాదం అవుతూ ఉంది. ఏపీలో టిక్కెట్ల ధరలను తగ్గించడంపై సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే పలువులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా టిక్కెట్ల వివాదంపై సరైన నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలంటూ పలు వేదికలపై ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, జగన్ సర్కార్‌ల మధ్య టిక్కెట్ల ధరల వివాదానికి ఎండ్ కార్డ్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ కలవబోతున్నారు. టికెట్ల ధరలు పెంచాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డిమాండ్ చేస్తున్న సమయంలో ఈరోజు(13 జనవరి 2022) చిరంజీవి జగన్‌ను కలవబోతున్నారు.
వీరి భేటి తర్వాత ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య జరుగుతున్న యుద్ధం ముగుస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా ఈరోజు జగన్‌ని కలిసే అవకాశం కనిపిస్తోంది.
Sukumar-Vijay: లెక్కల మాస్టారితో రౌడీబాయ్.. వీర సైనికుడి విధ్వంసమే!
సీఎం జగన్‌తో కలిసి మధ్యాహ్నం లంచ్ చేయబోతున్నారు చిరంజీవి. సీఎం జగన్‌ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. ఈ సమావేశంలో సినిమా టికెట్ల వివాదంపై సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి ఏం మాట్లాడుతారు? జగన్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.