Sukumar-Vijay: లెక్కల మాస్టారితో రౌడీబాయ్.. వీర సైనికుడి విధ్వంసమే!

రౌడీఫ్యాన్స్ కు కిక్కించే పోస్ట్ చేశాడు రౌడీబాయ్. 2023.. దడదడలాడాల్సిందే అంటూ సూపర్ హింట్ ఇచ్చాడు. ఇంకేముంది ఉన్నాట్టా లేనట్టా అనుకుంటున్న ప్రాజెక్ట్ విషయంలో తగ్గేదే లేదని..

Sukumar-Vijay: లెక్కల మాస్టారితో రౌడీబాయ్.. వీర సైనికుడి విధ్వంసమే!

Sukumar Vijay Devarakonda

Sukumar-Vijay: రౌడీఫ్యాన్స్ కు కిక్కించే పోస్ట్ చేశాడు రౌడీబాయ్. 2023.. దడదడలాడాల్సిందే అంటూ సూపర్ హింట్ ఇచ్చాడు. ఇంకేముంది ఉన్నాట్టా లేనట్టా అనుకుంటున్న ప్రాజెక్ట్ విషయంలో తగ్గేదే లేదని చెప్పేసినట్టే. 2023లో సుకుమార్ తో విజయ్ దేవరకొండ పట్టాలెక్కబోతున్నట్టే. ఇప్పుడిద్దరూ ప్యాన్ ఇండియా స్టార్స్.. దీంతో వీళ్ల లైనప్ ఎలా ఉండబోతుందా అంటూ చర్చలు సాగుతున్నాయి.

RRR: ఆర్ఆర్ఆర్ వాయిదా పడినా బాధలేదు.. చెర్రీ భావోద్వేగం!

లెక్కల మాస్టారితో సెట్టయినట్టే రౌడీబాయ్. ఇన్నిరోజులు సుక్కూ – విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ ఉంటుందా.. లేదా అన్న విషయంలో డైలామా ఉండేది. రీసెంట్ గా విజయ్ చేసిన పోస్ట్ తో అది ఉన్నట్టే అని తేలిపోయింది. సుకుమార్ బర్త్ డే స్పెషల్ గా విషెస్ చెప్తూ 2021 ది రైజ్.. 2022 ది రూల్… 2023 ది ర్యాంపేజ్ అంటూ ట్వీట్ వదిలాడు లైగర్. అంతేనా.. నీతో సినిమా చేసేందుకు వెయిట్ చేయలేకపోతున్నానంటూ ఉన్న విషయం రివీల్ చేసేశాడు. దీంతో మాస్ కా బాప్స్ అన్నట్టు తయారైన ఈ ఇద్దరూ కలిస్తే రచ్చ రంబోలానే అంటున్నారు సినీజనాలు.

Arjun-Malaika: అర్జున్-మలైకా బ్రేకప్.. ఏంటి హాట్ కపుల్ విడిపోతున్నారా?

త్వరలోనే పుష్ప సెకండ్ పార్ట్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారు సుకుమార్. అటు కొవిడ్ బ్రేక్ తీసుకుంటున్న రౌడీబాయ్.. లైగర్ పూర్తిచేయాల్సి ఉంది. సుకుమార్ పుష్ప2ని తీసుకొచ్చే టైమ్ కల్లా.. విజయ్ దేవరకొండ లైగర్ ని మాత్రమే పూర్తి చేస్తాడా.. శివ నిర్వాణ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తాడా అన్నదానిపై క్లారిటీ రావాలి. అయితే లైగర్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రౌడీ.. శివనిర్వాణతో కాంబో కడతాడా.. లేదా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

Chiru 154: చిరుకి తమ్ముడిగా మాస్ రాజా.. బర్త్ డే రోజు ప్రకటన!

పుష్పతో పాన్ ఇండియా వైడ్ స్టార్ డైరెక్టర్ క్రేజ్ తెచ్చుకున్నారు సుకుమార్. లైగర్ తో విజయ్ దేవరకొండ నేషనల్ స్టార్ అయిపోయినట్టే. ఇక వీళ్లిద్దరూ కలిస్తే విజయ్ చెప్పినట్టు ర్యాంపేజ్.. అదే విధ్వంసం సృష్టించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ కోసం వార్ బ్యాక్ డ్రాప్ లో వీర సైనికుడి కథను సుకుమార్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రౌడీ వర్షన్ లో ఆర్య3ని సెట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.