Chiru 154: చిరుకి తమ్ముడిగా మాస్ రాజా.. బర్త్ డే రోజు ప్రకటన!

తెలుగు సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా..

Chiru 154: చిరుకి తమ్ముడిగా మాస్ రాజా.. బర్త్ డే రోజు ప్రకటన!

Chiru 154

Chiru 154: తెలుగు సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ తో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాను మొదలు పెట్టాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Pushpa: బర్నింగ్ కలెక్షన్లు.. బాలీవుడ్ స్టార్లు బెంబేలెత్తే రికార్డులు!

ఇప్పటికే ఈ సినిమా నుండి వదిలిన మాస్ లుక్ అభిమానులను ఒక్కసారిగా అలెర్ట్ చేసింది. కాగా ఈ సినిమాలో చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోండగా ఇందులో చిరంజీవి పాత్రకి తగ్గట్లే తమ్ముడి పాత్ర ఒకటి ఉందట. సినిమాలో ఈ పాత్ర చాలా బలంగా ఉండడంతో పాటు సినిమాకి చాలా అవసరం కూడా ఉంటుందట. దీంతో ఈ పాత్ర ఎవరు చేయనున్నారన్నది ఈ సినిమా ప్రకటించిన సమయం నుండే ఆసక్తి కరంగా మారింది. ఆ మధ్య ఈ పాత్ర కోసం డైరెక్టర్ బాబీ చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడని ప్రచారం జరిగింది.

Movie Releases: ఫిబ్రవరి సినిమాలూ కష్టమే.. మళ్ళీ తప్పని వాయిదాల పర్వం!

గతంలో బాబీతో పవన్ కు మంచి రిలేషన్ ఉండడంతో ఇది నిజం కావచ్చని కూడా మెగా అభిమానులు ఆశపడ్డారు. కానీ, పవన్‌ ప్లేస్‌లో రవితేజ ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో 40 నిమిషాల పాటు సాగనున్న ఈ పాత్రలో రవితేజ నటించనున్నాడట. త్వరలోనే రవితేజ పుట్టిన రోజున దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. రవితేజ చిరంజీవికి ఎంత పెద్ద అభిమానో అందరికీ తెలుసు. గతంలో అన్నయ్య సినిమాలో ఓసారి చిరంజీవికి తమ్ముడిగా కనిపించగా.. శంకర్ దాదా జిందాబాద్ లో తళుక్కున మెరిశాడు. ఇక, ఇప్పుడు మరోసారి మల్టీస్టారర్ రేంజ్ పాత్రలో నటించనున్నాడు.