Arjun-Malaika: అర్జున్-మలైకా బ్రేకప్.. ఏంటి హాట్ కపుల్ విడిపోతున్నారా?

బాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ బ్రేకప్ న్యూస్ లకి హాట్ స్పాట్ అవుతోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ హాట్ కపుల్ మలైకా, అర్జున్ కపూర్ బ్రేకప్ అయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సంవత్సరం..

Arjun-Malaika: అర్జున్-మలైకా బ్రేకప్.. ఏంటి హాట్ కపుల్ విడిపోతున్నారా?

Arjun-Malaika: బాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ బ్రేకప్ న్యూస్ లకి హాట్ స్పాట్ అవుతోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ హాట్ కపుల్ మలైకా, అర్జున్ కపూర్ బ్రేకప్ అయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సంవత్సరం పెళ్లి పీటలెక్కుదామనుకున్న ఈ జంట.. మొన్నీమద్య వరకూ ముద్దు ముచ్చట్లతో సోషల్ మీడియాలో మునిగితేలిన ఈ జంట ఇప్పుడు ఒక్కటవ్వకుండానే విడిపోయారా అంటే అవుననే అంటున్నాయి బీటౌన్ వర్గాలు.

Arjun-Malaika: ఆంటీతో డేటింగ్ ఏంటి.. అర్జున్ ఘాటు రిప్లై!

బాలీవుడ్ హ్యాపెనింగ్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా 4 ఏళ్లుగా లవ్ లైఫ్ లో మునిగి తేలుతున్నారు. ఈ మోస్ట్ ఇంట్రస్టింగ్ కపుల్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ హాట్ కపుల్ 4 ఏళ్ల ప్రేమ కథ మూడ్నాళ్ల ముచ్చటే అయ్యిందంటూ బాలీవుడ్ మీడియా తెగ హడావిడి చేస్తోంది.

Malaika Arora: మతి చెడగొడుతున్న మలైకా అందం!

మలైకా అర్జున్ కంటే వయసులో 12 ఏళ్లు పెద్దది. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట వారం రోజులుగా ఎడ మొహం పెడ మొహంగా ఉన్నారని, అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని టాక్. అంతేకాదు.. 6 రోజులుగా మలైకా ఇంటి నుంచి బయటికేరాలేదని, ఇన్నిరోజులైనా అర్జున్ కపూర్ మలైకాని చూడడానికి కూడా వెళ్లలేదని బాలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మలైకా, అర్జున్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటున్నారంటూ ఇప్పటికే న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతలోనే బ్రేకప్ రూమర్స్ ఫాన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి.

Malaika Arora: ఈ వయసులో హైహీల్స్ అవసరమా.. మలైకాకు నెటిజన్ల ట్రోలింగ్!

అర్జున్ కపూర్ చెల్లి రియా కపూర్ ఇంటికి మలైకా ఇల్లు చాలా దగ్గరలోనే ఉంటుంది. జనరల్ గా రియా దగ్గరకి వెళ్లిన ప్రతి సారీ మలైకా ఇంటికి వెళ్లొస్తూ ఉండేవాడు. కానీ వారం రోజుల నుంచి ఇద్దరి మద్య రాకపోకలు ఆగిపోయాయి. ఫ్యామిలీ డిన్నర్స్ కి కలిసి అటెండ్ అయ్యే ఇద్దరూ అసలు ఈ మద్య అడ్రసే లేరు. ఇలా రకరకాలుగా మలైకా, అర్జున్ విడిపోతున్నారంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అర్జున్ కపూర్, మలైకా ఈమధ్యనే మాల్దీవ్స్ ట్రిప్ కెళ్లి ఎంజాయ్ చేసొచ్చారు.