Malaika Arora: ఈ వయసులో హైహీల్స్ అవసరమా.. మలైకాకు నెటిజన్ల ట్రోలింగ్!

చూసేందుకు అందంగా కనిపించేందుకు హీరోయిన్స్ పొట్టి పొట్టి బట్టలు, హైహీల్స్ వేసుకోవడం.. ఆ తర్వాత పబ్లిక్ లో వాటితో ఇబ్బందులు పడడం మనం చాలా చూసే ఉంటాం. ఇలాంటి వీడియోలు కూడా..

Malaika Arora: ఈ వయసులో హైహీల్స్ అవసరమా.. మలైకాకు నెటిజన్ల ట్రోలింగ్!

Malaika Arora

Updated On : December 28, 2021 / 6:02 PM IST

Malaika Arora: చూసేందుకు అందంగా కనిపించేందుకు హీరోయిన్స్ పొట్టి పొట్టి బట్టలు, హైహీల్స్ వేసుకోవడం.. ఆ తర్వాత పబ్లిక్ లో వాటితో ఇబ్బందులు పడడం మనం చాలా చూసే ఉంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ విపరీతంగా ట్రోల్ అవుతుంటాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కూడా ఇప్పుడు అలాంటి ట్రోలింగ్ నే ఎదుర్కొంటుంది. అసలే లేటు వయసులో హాట్ అవతారంలో మలైకా చేసే రచ్చ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుండే సంగతి తెలిసిందే.

Shraddha Das: చిల్లవుట్‌లో హాట్ హాట్ శ్రద్ధా!

కాగా, మలైకా ఈ మధ్యనే కరిష్మా కపూర్‌ ఇంట్లో పార్టికి హాజరైంది. ఈ పార్టీలో గ్రీన్‌ కలర్‌ బోల్డ్‌ అవుట్‌ఫిట్‌లో హైహీల్స్‌ వేసుకుని సూపర్‌ స్టైలిష్‌గా కనిపించింది. అయితే.. కారు దిగబోతు హైహీల్స్ బ్యాలెన్స్‌ అదుపు తప్పి కిందపడబోయింది. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి ఆమెకు సాయం అందించడంతో సేఫ్‌ అయి బ్యాలెన్ కాగలిగింది. అనంతరం నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చి పార్టీకి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుండగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Nabha Natesh: నిషా కళ్ళ నభా.. నీ అందం రోజురోజుకూ పెరుగుతుందా?!

హీరోయిన్స్ విషయంలో అప్పుడప్పుడు ఇలా జరుగడం కామన్ అంటూ కొందరు మలైకాకు సపోర్ట్‌గా నిలబడగా.. మరికొందరు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలే వయసైపోయింది. పైగా అంత ఎత్తున హైహీల్స్ ఎందుకు మలైకా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న మ్యాటర్ లీకైనప్పటి నుండి మలైకా ఏజ్ మీద సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంటుంది. దీనికి తోడి ఇలాంటి అన్ సీన్ వీడియోలు బయటకి రావడంతో మరికాస్త రోస్ట్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)