Rayalacheruvu
Rayalacheruvu : చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రాయల చెరువు ఇంకా ప్రమాదం అంచునే ఉంది. చెరువు నిండు కుండలా ఉంది. గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. 36 వేల సిమెంట్ బస్తాలతో గండి పూడ్చివేత కొనసాగుతోంది. సిమెంట్ ను టీటీడీ ఉచితంగా అందిస్తోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎస్పీ వెంకట అప్పల నాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం.. తిరుపతి విమానాశ్రయంలో మూడు నేవీ హెలికాప్టర్లను రెడీ చేశారు. నేషనల్, స్టేట్ DRF సిబ్బంది, చెన్నై, ఐఐటీ నిపుణుల ఆధ్వర్యంలో పూడ్చివేత పనులు జరుగుతున్నాయి. పూడ్చివేత పనుల్లో 200 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
చదవండి : Rayalacheruvu Lake : రాయల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది..చెవిరెడ్డి హెచ్చరికలు
రాయల్ చెరువు నీటి సామర్థ్యం 0.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం చెరువులో 0.8 టీఎంసీల నీరు ఉంది. దీంతో చెరువు కట్టక్రమంగా దెబ్బతింటుంది. కట్టతెగే ప్రమాదం ఉండటంతో 16 గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇన్‌ఫ్లో కన్నా అవుట్ ఫ్లో అధికంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిన్నటితో పోల్చితే ఇన్‌ఫ్లో తగ్గింది. చెరువుకు 2000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 5000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. చెరువు వద్ద పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
చదవండి : Rayala Pond : రాయల చెరువు నుంచి లీకవుతున్న నీరు..కట్ట తెగితే 100 గ్రామాలకు ముప్పు
Situation at #Rayalacheruvu#Tirupatifloods pic.twitter.com/WAshuBISpM
— ???? (@__UpendraDhfm) November 21, 2021
నవంబరు 22 : ఉదయం 6 గంటలకు రాయల చెరువుకు గండి పడిన ప్రదేశం లో
మట్టితో పూడ్చడం జరిగింది..!! @chittoorgoap #Rayalacheruvu @collectorctr #Tirupati @APWeatherman96 pic.twitter.com/77V6fHcTeJ— Geetha (@DrGeethaRoyal) November 22, 2021