Rayalacheruvu Lake : రాయల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది..చెవిరెడ్డి హెచ్చరికలు

ఏ క్షణమైనా రాయల చెరువు కట్ట తెగే ప్రమాదం  ఉండడంతో.. నీటి మట్టాన్ని, గండిని పరిశీలించారు కలెక్టర్‌ హరి నారాయణ్‌, ఎస్పీ వెంకట అప్పలనాయుడు.

Rayalacheruvu Lake : రాయల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది..చెవిరెడ్డి హెచ్చరికలు

Rayalacheruvu

Rayalacheruvu Lake Chevireddy Bhaskar Reddy : తిరుపతిలో రాయల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని సమీప ప్రజలు పునరావాసా కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా పలు ట్వీట్స్ చేశారు. ఒక వేళ రాయలచెరువు కట్ట తెగిపోతే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని, హెలికాఫ్టర్‌లను కూడా సిద్దం చేశామని ప్రకటించారు. తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆర్సీపురం ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు రాయలచెరువు కట్టను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.

Read More : AP Capital : రాజధాని..కీలక పరిణామం, ఎప్పుడేం జరిగింది ?

రాయలచెరువు గండి పడి నీరు లీకేజీ అవుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి రాయలచెరువు ముంపు ప్రాంత గ్రామాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఎప్పటికప్పుడు వరద ఉదృతిని పరిశీలిస్తూ, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. రామాపురంలోని వెరిటాస్‌ సైనిక్‌ స్కూలు, గంగిరెడ్డిపల్లెలోని ఏఈఆర్‌ ఎంబీఏ కళాశాల, కమ్మకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 2 వేల కుటుంబాలకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. తాము చర్యలు తీసుకోవడం జరిగిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు.

Read More : Christmas Parade : ఉన్మాది ఘాతుకం.. పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు.. 40 మందికి గాయాలు

దిగువ ప్రాంతానికి నీరు లీకవుతుండడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణమైనా రాయల చెరువు కట్ట తెగే ప్రమాదం  ఉండడంతో.. నీటి మట్టాన్ని, గండిని పరిశీలించారు కలెక్టర్‌ హరి నారాయణ్‌, ఎస్పీ వెంకట అప్పలనాయుడు. గండి పూడ్చివేత పనులను పరిశీలించారు. ముందస్తు చర్యగా సుమారు 20 గ్రామాల  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు బాధితులకు రెండు సురక్షిత కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు రెవెన్యూ అధికారులు. లోతట్టుప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు.
కొండ ప్రాంతాల నుంచి చేరిన వర్షపునీరుతో రాయల చెరువు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది.

Read More : Young Lady Cheating : డాక్టర్ అవ్వాలనుకుంది…. నేరస్థురాలు అయ్యింది

దీంతో చెరువు దిగువనున్న ముళ్లపూడి, పాడిపేట, కుంట్రపాకం, తనపల్లి, పద్మవల్లి పురం, బలిజ పల్లి, గంగిరెడ్డి పల్లి గ్రామాలకు ముంపు పొంచి ఉంది. సంతబైలు, ప్రసన్న వెంకటేశ్వరపురం, నెన్నూరు, సంజీవరాయపురం, కమ్మపల్లి గ్రామాలకు వరద పోటెత్తే ప్రమాదం ఉంది.  గొల్లపల్లె, కమ్మ కండ్రిగ, నడవలూరు, వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరు గ్రామాల ప్రజలనూ అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాలను ప్రజలంతా ఖాళీ చేయాలని హెచ్చరించారు. రాయల చెరువుకు చిన్న గండి పడడంతో.. ఈ రూట్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
రాయల చెరువుకు పడిన చిన్న గండితో ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదన్నారు కలెక్టర్‌ హరినారాయణ్‌. అయితే చెరువు ఏ క్షణమైనా తెగే ప్రమాదం ఉందని.. ముందస్తు చర్యగా ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా అలర్ట్‌ ప్రకటించామన్నారు.