Young Lady Cheating : డాక్టర్ అవ్వాలనుకుంది…. నేరస్థురాలు అయ్యింది

డాక్టరవ్వాలనుకున్నా కానీ యాక్టరయ్యా  అనేది సినీ నటులు సాధారణంగా చెప్పే డైలాగ్... కానీ ఓ మహిళా డాక్టరేట్ పట్టా కొనుక్కుని నేరం చేయటంలో   డాక్టరేట్ తీసుకుంది.

Young Lady Cheating : డాక్టర్ అవ్వాలనుకుంది…. నేరస్థురాలు అయ్యింది

Young lady cheating

Young Lady Cheating :  డాక్టరవ్వాలనుకున్నా కానీ యాక్టరయ్యా  అనేది సినీ నటులు సాధారణంగా చెప్పే డైలాగ్… కానీ ఓ మహిళా డాక్టరేట్ పట్టా కొనుక్కుని నేరం చేయటంలో   డాక్టరేట్ తీసుకుంది. ప్రముఖ రచయిత ఆమె పేరుతో ఒక ప్రత్యేక  పాట రాశారు. సినిమాలో పాటను తలదన్నేలా ఆ పాటను చిత్రీకరించారు.

డాక్టరేట్ పట్టా ప్రదానం జరిగే రోజు జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు.. తీరా చేస్తే ఆమె ఏమైనా గొప్ప రాజకీయ నాయకురాలా అంటే అదేంకాదు. సినిమా యాక్టరా అంటే అదేంకాదు. ఈమె పెద్ద కిలాడీ లేడీ. తన డబ్బులతో ఈ హంగూ ఆర్భాటాలు ఏర్పాటు చేయించుకుంది. ఈజీ మనీ కోసం వందలాది మంది నుంచి డబ్బులు కొట్టేసింది. తక్కువ ధరకే ద్విచక్రవాహానాలు అందిస్తామని ఆకర్షణీయమైన పధకాలు సృష్టించి ప్రజలను కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టింది.

హైదరాబాద్ జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే కునకుల పల్లవిరెడ్డి(32) ఈజీ మనీ సంపాదించే ఆలోచనతో ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది.  ఓ వెబ్ సైట్‌ను   సంప్రదిస్తే వారు ఫ్రాంచైజీ తీసుకోవాలన్నారు.  వేరే వ్యక్తి పేరుతో   సభ్యత్వం   తీసుకుని వాళ్లు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకుంది. ఫిర్జాదీగూడ, కుషాయిగూడ, దమ్మాయిగూడ. తదితర ప్రాంతాల్లో మల్టీ బ్రాండ్ షోరూంలను ఓపెన్ చేసింది.

40 మంది ఉద్యోగులను నియమించుకుని కాల్‌సెంటర్   ప్రారంభించింది.  2 వేల రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తి వద్దనుంచి 10 వేల ఫోన్ నెంబర్లు కొన్నది.  టెలీ‌కాలర్స్   సహాయంతో వారందరికీ   ఫోన్ చేయించింది. వారు షోరూం‌కు   వచ్చిన  తర్వాత వారికి స్టాంప్ పేపరు మీద అగ్రిమెంట్ రాసి ఇచ్చింది. దీంతో వారికి నమ్మకం కలిగింది.

వారిలో ఒకరు తక్కువ ఎమౌంట్ కట్టి మరో నలుగురిని చేర్పిస్తే వారికి తక్కువ ధరకు బైక్ ఇస్తానని చెప్పింది. ఆ క్రమంలో ఒకరు నలుగురిని, నలుగురు మరో 16 మందిని చేర్పించి  కనీస మొత్తం  కట్టి చేర్పించారు. ఇలా వందలాది మంది సభ్యులుగా చేరి సుమారు రూ. 5 కోట్ల రూపాయలు సంస్ధకు చెల్లించారు. సెక్యూరిటీ కోసం బౌన్సర్లను పెట్టుకుంది.
Also Read : AP Three Capitals : ఏపీలో 3 రాజధానుల బిల్లు రద్దు
వచ్చిన డబ్బులతో సేవా   కార్యక్రమాలు చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించుకున్నారు. వీటి   ప్రచారం కోసం ఒక ప్రైవేట్  పీఆర్ సంస్ధతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్ధ పల్లవి రెడ్డి గురించి పబ్లిసిటీ బాగా చేసింది.  డబ్బులు కట్టినా బైక్ రాకపోవటంతో ఒక సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పల్లవి‌రెడ్డిని   అదుపులోకి తీసుకుని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.