Christmas Parade : ఉన్మాది ఘాతుకం.. పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు.. 40 మందికి గాయాలు

అమెరికాలో జనసమూహంపై ట్రక్కులు దూసుకురావడం పరిపాటిగా మారింది. తాజాగా అమెరికాలోని విస్కిన్‌స‌న్‌లో ఓ ఉన్మాది కారుతో బీభ‌త్సం సృష్టించాడు.

Christmas Parade : ఉన్మాది ఘాతుకం.. పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు.. 40 మందికి గాయాలు

Christmas Parade

Christmas Parade : అమెరికాలో జనసమూహంపై ట్రక్కులు దూసుకురావడం పరిపాటిగా మారింది. ఆదివారం అమెరికాలోని విస్కిన్‌స‌న్‌లో ఓ ఉన్మాది కారుతో బీభ‌త్సం సృష్టించాడు. క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తున్న తరుణంలో క్రైస్తవులు పరేడ్ తీస్తున్నారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి ఆ పరేడ్‌ను టార్గెట్ చేశాడు. కారులో వేగంగా దూసుకొచ్చిన ఉన్మాది పరేడ్ తీస్తున్నవారిని వెనుక నుంచి వచ్చి ఢీకొంటాడు. ఈ ఘటనలో 40 మందికి గాయపడగా ఐదుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో 20 మంది చిన్నారులు గాయపడినట్లు తెలిపారు.

చదవండి : Latin American Artist : అరుదైన పెయింటింగ్..చాలా కాస్ట్ గురూ

అయితే ఈ ఘటన ఉగ్రవాద ప్రేరేపితం కాదని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ దాడికి వదిన ఎస్‌యూవీని పోలీసులు సీజ్ చేశారు.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప‌రేడ్ మీద‌కు కారు దూసుకువ‌స్తున్న స‌మ‌యంలో పోలీసులు ఆ కారుపై కాల్పులు జ‌రిపారు. ఈ కేసు విచార‌ణ‌లో ఎఫ్‌బీఐ స‌హ‌కరిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు.

చదవండి :  Amazon delivery truck : పుట్టిన రోజే పునర్జన్మ.. రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు

చ‌రిత్రాత్మ‌క‌మైన వౌకేషా న‌గ‌రంలో ఉన్న కొన్ని వీధుల్లో ఆ ఊరేగింపు సాగ‌నున్న‌ది. ప‌రేడ్‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ముందే రిలీజ్ చేశారు. ప‌రేడ్ ఘ‌ట‌న‌కు చెందిన విష‌యాన్ని అధ్య‌క్షుడు జో బైడెన్‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ ఘటనపై అధ్యక్షుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షాచాలని తెలిపారు. ఎటువంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు వివరించారు.