Amazon delivery truck : పుట్టిన రోజే పునర్జన్మ.. రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు

రైలు ప్రమాదాలు సర్వసాధారణం.. అయితే రైలు ప్రమాదానికి గురైకూడా ప్రాణాలతో పయటపడటం అదృష్టమనే చెప్పాలి. తాజాగా అమెరికాలో జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు

Amazon delivery truck : పుట్టిన రోజే పునర్జన్మ.. రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు

Amazon Delivery Truck

Amazon delivery truck :  రైలు ప్రమాదాలు సర్వసాధారణం.. అయితే రైలు ప్రమాదానికి గురైకూడా ప్రాణాలతో పయటపడటం అదృష్టమనే చెప్పాలి. తాజాగా అమెరికాలో అమెజాన్ డెలివరీ వ్యాన్ రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు దానిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ రెండు ముక్కలైంది. అంతవేగంగా రైలు ఢీకొన్న డ్రైవర్ అలెగ్జాండర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. కాగా ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్‌లో చోటుచేసుకుంది.

చదవండి : Trains Canceled : ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు

ఇక ఈ ఘటనపై డ్రైవర్ అలెగ్జాండర్‌ మాట్లాడుతూ.. ట్రాక్ వద్ద రెడ్ లైట్, స్టాప్ గెట్ లేకపోవడంతో వ్యాన్ను ముందుకు పోనిచ్చానని.. రైలు శబ్దం వినిపించడంతో వెంటనే తేరుకుని వేగం పెంచాను.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వ్యాన్‌ రెండు ముక్కలైంది. నేను మాత్రం బతికే ఉన్నాను. అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యమే అని అలెగ్జాండర్‌ పేర్కొన్నాడు. అయితే ప్రమాదం జరిగిన రోజు అతడు 33వ ఏట అడుగుపెట్టాడు. ఈ ప్రమాదం నుంచి బయటపడటం అనేది పుట్టిన రోజే పునర్జన్మ ఎత్తినట్లు ఉందని పేర్కొన్నాడు.

చదవండి :  Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌లో ఐపీఎల్ లైవ్!!