AP Capital : రాజధాని..కీలక పరిణామం, ఎప్పుడేం జరిగింది ?

ఏపీలో వికేంద్రీకరణ కోసం రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్‌ 13న రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

AP Capital : రాజధాని..కీలక పరిణామం, ఎప్పుడేం జరిగింది ?

Ap Capital

AP Capital : ఏపీ రాజధాని అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది ఏపీ ప్రభుత్వం. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఏపీలో వికేంద్రీకరణ కోసం రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్‌ 13న రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. ప్రజల అభిప్రాయాలు సేకరించింది. మరోవైపు.. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ తొలిసారిగా అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ఆ తర్వాత 2019 డిసెంబర్‌ 20న జీఎన్‌ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

Read More : Christmas Parade : ఉన్మాది ఘాతుకం.. పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు.. 40 మందికి గాయాలు

మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్‌ 29న రాష్ట్రం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే.. 2020 జనవరి 3న బోస్టన్‌ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది.  రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది.

Read More : Young Lady Cheating : డాక్టర్ అవ్వాలనుకుంది…. నేరస్థురాలు అయ్యింది

అనంతరం 2020 జనవరి 20న హైపవర్‌ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా.. ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్‌ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లులను పంపించింది. అయితే… మధ్యలో న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు ఉండటంతో.. గవర్నర్ న్యాయసలహాలు తీసుకున్నారు. అనంతరం.. 2020 జులై 31న పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. రాజధానిపై సీఎ జగన్ చేయబోయే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు…ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు.